Subhash Goud | Edited By: Anil kumar poka
Updated on: Jul 29, 2021 | 8:11 AM
Maruti Suzuki: ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ జూన్ నెలతో ముగిసిన త్రైమాసిక ఫలితాలను బుధవారం వెల్లడించింది. నికర లాభం రూ. రూ.440.8 కోట్లుగా నమోదైంది. గత సంవత్సరం ఇదే సీజన్‌లో కంపెనీ రూ.249.4 కోట్ల నికర నష్టాలను ప్రకటించింది.
అయితే ఈసారి లాభాలు విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోయాయి. రెండో దశ కరోనా మహమ్మారి విజృంభణతో కంపెనీ విక్రయాలు పడిపోవడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు.
క్రితం త్రైమాసికంతో పోలిస్తే మాత్రం కంపెనీ లాభాలు 62.19 శాతం. కంపెనీ సమీకృత ఆదాయం 332.72 శాతం పెరిగి రూ.17,770.7 కోట్లుగా నమోదైంది.
గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.4,105 కోట్లు ఆదాయాన్ని ఆర్జించింది. కంపెనీ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 3,53,614 వాహనాల విక్రయాలను కొనసాగించింది. వీటిలో 3,08,095 దేశీయంగా అమ్ముడుకాగా.. 45,519 వాహనాలను విదేశాలకు ఎగుమతి చేసింది.