- Telugu News Photo Gallery Business photos LPG Cylinder price hike in march 2024 bank holiday, share market bse nse, holiday, fastag kyc
New Rules in March: మార్చి 1 నుంచి మారిన నిబంధనలు.. గుడ్‌న్యూస్.. బ్యాడ్ న్యూస్.. ఆ గడువు పొడిగింపు
మార్చి 1వ తేదీ నుంచి పలు అంశాలలో నిబంధనలు మారాయి. మొదటి రోజే ఆయిల్ కంపెనీలు వినియోగదారులకు షాకిచ్చాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను పెంచాయి. మార్చి 1, 2024న ఢిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.25.50 పెరిగింది. ఇది కాకుండా, నెల మొదటి రోజు నిబంధనలలో మార్పు వచ్చింది. ఈ 5 నియమాల గురించి తెలుసుకుందాం...
Updated on: Mar 01, 2024 | 6:03 PM

మార్చి 1వ తేదీ నుంచి పలు అంశాలలో నిబంధనలు మారాయి. మొదటి రోజే ఆయిల్ కంపెనీలు వినియోగదారులకు షాకిచ్చాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను పెంచాయి. మార్చి 1, 2024న ఢిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.25.50 పెరిగింది. ఇది కాకుండా, నెల మొదటి రోజు నిబంధనలలో మార్పు వచ్చింది. ఈ 5 నియమాల గురించి తెలుసుకుందాం..

స్టాక్ మార్కెట్ 13 రోజుల పాటు మూసివేత: మార్చి నెలలో స్టాక్ మార్కెట్లు 13 రోజుల పాటు మూతపడనున్నాయి. పండుగల కారణంగా మార్చిలో మూడు రోజులు, వారాంతపు సెలవుల కారణంగా 10 రోజులు స్టాక్ మార్కెట్ మూసివేయబడుతుంది. మార్చి నెలలో 5 ఆదివారాలు, 5 శనివారాలు ఉన్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్‌ఇ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఇ) మార్చిలో 13 రోజుల పాటు ట్రేడింగ్‌కు వెళ్లడం లేదు. ప్రభుత్వ సెలవు దినాల్లో స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ ఉండదు. శివరాత్రి, హోలీ, గుడ్ ఫ్రైడే కారణంగా స్టాక్ మార్కెట్ మార్చిలో మూసి ఉంటుంది.

మార్చిలో 14 రోజుల పాటు బ్యాంకులు మూత: మార్చిలో 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ 14 రోజుల సెలవుల్లో అన్ని ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాలు కూడా ఉన్నాయి. అంటే వారపు సెలవులు కాకుండా, బ్యాంకుల పండుగల కారణంగా ఎనిమిది రోజులు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏకకాలంలో 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడవు. ఈ సెలవులు వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు రోజుల్లో ఉంటాయి. సెలవులు ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే బ్యాంకులు మూసి ఉంటాయి. మార్చి నెలలో శివరాత్రి, హోలీ, గుడ్ ఫ్రైడే వంటి పండుగలు ఉన్నాయి. వాటి కారణంగా బ్యాంకులు మూసి ఉండనున్నాయి. మీకు ఏదైనా బ్యాంకు సంబంధిత పని ఉంటే సెలవుల జాబితాను తనిఖీ చేసుకుని ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం.

ఫాస్టాగ్ కేవైసీ: నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్టాగ్ KYCని అప్‌డేట్ చేయడానికి ఫిబ్రవరి 29 చివరి తేదీ ఉండేది. కానీ ఇది మార్చి 31 వరకు పొడిగించారు. మీరు ఫాస్టాగ్ కోసం కేవైసీని 31 మార్చి 2024 వరకు పొందవచ్చు.

సోషల్ మీడియా కొత్త నిబంధనలు: ప్రభుత్వం తాజాగా ఐటీ నిబంధనలను మార్చింది. X, Facebook, YouTube, Instagram వంటి సోషల్ మీడియా యాప్‌లు ఈ నిబంధనలను అనుసరించాలి. మార్చి నుంచి సోషల్ మీడియాలో తప్పుడు వాస్తవాలతో కూడిన వార్తలను ప్రసారం చేస్తే, దానికి జరిమానా విధించవచ్చు. సామాజిక మాధ్యమాలను సురక్షితంగా ఉంచడమే ప్రభుత్వ లక్ష్యం.




