- Telugu News Photo Gallery Business photos Income tax rule: How much cash can you receive in your bank savings account in one financial year to avoid I T notice?
Savings Account Rules: మీ సేవింగ్స్ ఖాతాలో ఈ మొత్తంలో డిపాజిట్ చేస్తున్నారా? ఆదాయపు పన్ను నోటీసు రావచ్చు? జాగ్రత్త
Savings Account Rules: చాలా మంది తమ పొదుపు ఖాతాలో డబ్బులు డిపాజిట్ చేస్తుంటారు. అయితే పొదుపు ఖాతాకు నిబంధనలు ఉన్నాయి. పరిమితికి మించి లావాదేవీలు చేసినట్లయితే ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు రావచ్చు. అందుకు మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. లేకుంటే ఇబ్బందులు ఎదుర్కొంటారని గుర్తించుకోండి..
Updated on: Jan 20, 2025 | 5:29 PM

పొదుపు ఖాతాలో డబ్బులను డిపాజిట్ చేస్తుంటాము. కానీ ఇందులో కూడా ఓ పరిమితి ఉంది. మన ఖాతాలో ఈ పరిమితి కంటే ఎక్కువ డబ్బును డిపాజిట్ చేసుకుంటే ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు రావచ్చు. ఈ విషయం చాలా మందికి ఇప్పటికీ తెలియదు. పొదుపు ఖాతాకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ నియమాలు ఏమిటో చూద్దాం.

ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో పొదుపు ఖాతాలో జమ చేసే మొత్తం రూ.10 లక్షలకు మించకూడదు. ఈ పరిమితి దాటితే ఆదాయపు పన్ను శాఖకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అదే సమయంలో, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 269ST ప్రకారం, ఖాతాదారుడు ఒక రోజులో రూ. 2 లక్షల లావాదేవీలు చేయవచ్చు. ఏదైనా లావాదేవీ ఆ మొత్తాన్ని మించి ఉంటే, అతను బ్యాంకుకు కారణాన్ని వివరించాలి.

నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి రోజుకు రూ.50వేలు లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే బ్యాంకుకు సమాచారం ఇవ్వాలి. ఇది కాకుండా, ఖాతాదారుడు తన పాన్ వివరాలను కూడా అందించాలి. ఖాతాదారుడికి పాన్ లేకపోతే, అతను ఫారమ్ 60 లేదా 61ని సమర్పించాలి. అదే సమయంలో రూ. 10 లక్షల కంటే ఎక్కువ విలువైన లావాదేవీలను అధిక-విలువ లావాదేవీలుగా పరిగణిస్తారు. బ్యాంకు అటువంటి లావాదేవీల గురించి ఆదాయపు పన్ను శాఖకు సమాచారాన్ని అందిస్తుంది.

చాలా సార్లు, కొన్ని కారణాల వల్ల పెద్ద లావాదేవీలు చేయాల్సి ఉంటుంది. దాని గురించి ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాలి. అటువంటి పరిస్థితిలో శాఖ నుండి నోటీసు వస్తుంది. ఇప్పుడు ఈ పరిస్థితిలో మనం ఏమి చేయాలి అనే ప్రశ్న వస్తుంది. మీకు అలాంటి నోటీసు ఏదైనా అందితే, మీరు దానికి స్పందించాలి. నోటీసుకు సమాధానంతో పాటు, దానికి సంబంధించిన పత్రాల గురించి కూడా మీరు సమాచారం ఇవ్వాలి.

ఈ పత్రాలలో స్టేట్‌మెంట్‌లు, పెట్టుబడి రికార్డులు లేదా ఆస్తులు మొదలైనవి ఉంటాయి. నోటీసుకు ప్రత్యుత్తరం ఇవ్వడంలో లేదా పత్రానికి సంబంధించి మీకు ఏదైనా సమస్య ఉంటే, మీరు ఆర్థిక సలహాదారుని సంప్రదించవచ్చు.




