ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి నగదు ఉపసంహరణలు కోటి రూపాయలు దాటితేనే 194 ఎన్ సెక్షన్ వర్తిస్తుంది. ఉదాహరణకు ఒకసారి రూ.99 లక్షలు, మరో సారి రూ.1.50 లక్షలు విత్ డ్రా చేశారనుకుందాం. ఆ మొత్తం కోటి రూపాయలు దాటి రూ.50 వేలు అయ్యింది. కోటి వరకూ మినహాయింపు ఉంటుంది కాబట్టి ఆపైన ఉన్న రూ.50 వేలకు మాత్రమే టీడీఎస్ వసూలు చేస్తారు.