- Telugu News Photo Gallery Business photos Honda Activa: new variants of honda activa dio to launch ahead of festive season
Honda Activa: హోండా యాక్టివా నుంచి రెండు వేరియంట్లు.. విడుదలకు సిద్ధం.. ధర, ఫీచర్స్ వివరాలు ఇలా..!
Honda Activa: దసరా, దీపావళి పండుగ సీజన్ సమీపిస్తుండటంతో ప్రముఖ వాహన తయారీ సంస్థలు పోటాపోటీగా వాహనాలను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఇందులో భాగంగానే ..
Updated on: Sep 19, 2021 | 4:34 PM

Honda Activa: దసరా, దీపావళి పండుగ సీజన్ సమీపిస్తుండటంతో ప్రముఖ వాహన తయారీ సంస్థలు పోటాపోటీగా వాహనాలను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఇందులో భాగంగానే ఆటో దిగ్గజం హోండా మోటార్‌సైకిల్ స్కూటర్ ఇండియా సరికొత్త హోండా యాక్టివా, డియో స్కూటర్లను లాంచ్ చేసేందుకు సిద్దమవుతోంది.

హోండా యాక్టివా 6 జి రెండు కొత్త వేరియంట్లలో రానుండగా, డియో స్కూటర్ మాత్రం నాలుగు కొత్త వేరియంట్లలో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఈ రెండు మోడల్స్‌లో ఒకే రకమైన 109.51cc, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అందించడం విశేషం.

యాక్టివా 6జిలోని ఇంజిన్ 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 7.68 హెచ్‌పి, 5,250 ఆర్‌పిఎమ్ వద్ద 8.79 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక, డియో వేరియంట్లో ఉపయోగించే ఇంజిన్ 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 7.65 హెచ్‌పి, 4,750 ఆర్‌పిఎమ్ వద్ద 9 ఎన్ఎమ్‌ని ఉత్పత్తి చేస్తుంది. యాక్టివా 6జి రెండు వేరియంట్లలో లభిస్తుంది. యాక్టివా 6 జి, యాక్టివా 6 జి ఎల్‌ఈడి అనే రెండు కొత్త వేరియంట్లలో అందుబాటులోకి వస్తుంది.

ఇక, హోండా యాక్టివా నుంచి డియో మోడల్ కూడా విడుదల కానుంది. ఈ మోడల్ మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ డియో మోడల్‌లో డియో విత్ - కాంపోజిట్ కాస్ట్ వీల్స్, డిజిటల్ స్పీడోమీటర్, కాంపోజిట్ కాస్ట్ వీల్, 3 డి ఎంబెల్మ్, డిజిటల్ స్పీడోమీటర్, 3 డి ఎంబెల్మ్ వంటి ఫీచర్లను చేర్చనుంది. కాగా, హోండా యాక్టివా ప్రస్తుతం విక్రయిస్తున్న మోడళ్లలో రెప్సోల్ హోండా ఎడిషన్ మాత్రమే అల్లాయ్ వీల్స్ కలిగి ఉన్న ఏకైక వేరియంట్‌గా చెప్పవచ్చు.

ఈ రెండు హోండా వేరియంట్లు రాబోయే కొద్ది వారాల్లో మార్కెట్లోకి విడుదలకానున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. పండుగ సీజన్‌కి ముందే ఇవి విడుదయ్యే అవకాశం ఉంది. మరి కొద్ది రోజుల్లో వేరియంట్ల ధర, ఫీచర్లకు సంబంధిచిన అన్ని విషయాలు తెలియనున్నాయి.




