- Telugu News Photo Gallery Business photos Hero has launched three electric scooters priced at Rs. From 85 thousand
Hero: మూడు ఎలక్రిక్ స్కూటర్లను విడుదల చేసిన హీరో.. అన్నీ రూ. 85 వేల నుంచి..
హీరో ఎలక్ట్రిక్ మూడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను ఆప్టిమా సిఎక్స్ 2.0, ఆప్టిమా 5.0, ఎన్‌వైఎక్స్‌లను భారత మార్కెట్లో విడుదల చేసింది. వాటి గురించి తెలుసుకుందాం..
Updated on: Mar 16, 2023 | 2:10 PM

డార్క్ మ్యాట్ బ్లూ, మ్యాట్ మెరూన్‌లో ఆప్టిమా 2.0, డార్క్ మ్యాట్ బ్లూలో ఆప్టిమా 5.0, చార్‌కోల్ బ్లాక్, ఎన్‌వైఎక్స్ చార్‌కోల్ బ్లాక్, పెరల్ వైట్ కలర్ ఆప్షన్‌లలో కంపెనీ విడుదల చేసింది.

ఈ మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లు జర్మన్ ECU టెక్నాలజీతో అమర్చబడి ఉన్నాయి. Optima CX5.0 3 kWh C5 Li-ion బ్యాటరీతో ఆధారితమైనది. దీని గరిష్ట వేగం 55kmph , గ్రౌండ్ క్లియరెన్స్ 165mm. దీన్ని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 3 గంటలు పడుతుంది.

Optima CX2.0 యొక్క గరిష్ట వేగం 48 km/h, గ్రౌండ్ క్లియరెన్స్ 165mm. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 4.5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు

NYX CX5.0 స్కూటర్ గరిష్ట వేగం 48 km/h, గ్రౌండ్ క్లియరెన్స్ 175mm. ఇది 3 kWh C5 Li-ion బ్యాటరీని కలిగి ఉంది. స్కూటర్‌ను 3 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు

Optima CX 2.0, Optima 5.0, NYX ధరలు రూ. 85,000 నుండి ప్రారంభమవుతాయి. హీరో ఎలక్ట్రిక్ కంఫర్ట్ స్కూటర్ ధర రూ.85,000 నుండి రూ.95,000 మధ్య ఉంటుంది.




