Top Affordable Scooters: రూ. లక్షలోపు ధరలో బెస్ట్ స్కూటర్లు ఇవే.. సేల్స్‌లో టాప్ లేపుతున్నాయ్..
ద్విచక్ర వాహనం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? లోకల్ అవసరాలకు మంచి స్కూటర్ ఏముందా అని మార్కెట్లో సెర్చింగ్ చేస్తున్నారా? అది కూడా తక్కువ ధరలో మంచి పనితీరు కలిగిన స్కూటర్ అయితే బాగుండని ఆలోచిస్తున్నారా? అయితే ఈ కథనాన్ని మిస్ అవ్వొద్దు. దీనిలో మన దేశంలో అమ్ముడవుతున్న టాప్ స్కూటర్లను మీకు పరిచయం చేస్తున్నాం. అది కూడా కేవలం రూ. లక్షలోపు ధరలోనే. అత్యాధునిక ఫీచర్లతో పాటు అత్యద్భుత పనితీరు ఈ స్కూటర్ల సొంతం. వాటిపై మీరూ ఓ లుక్కేయండి..
Madhu |
Updated on: May 16, 2023 | 12:30 PM

హీరో మాస్ట్రో ఎడ్జ్ 125.. ఈ హీరో స్కూటర్ ధర రూ. 79,356 ఎక్స్-షోరూమ్. దీనిలో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ట్రిప్ అనాలిసిస్, లైవ్ ట్రాకింగ్, బ్లూటూత్ కనెక్టివిటీ, టోపాల్ అలర్ట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. అలాగే జియో-ఫెన్సింగ్, ఎల్‌ఈడీ లైటింగ్, వెహికల్ స్టార్ట్ అలర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

టీవీఎస్ ఎన్‌టార్క్.. ఈ స్కూటర్ ధర రూ. 84,386 ఎక్స్-షోరూమ్. దీనిలో కూడా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఫోన్ సపోర్ట్ వంటి ఇతర ఫీచర్‌లు ఉన్నాయి.

సుజుకి యాక్సెస్.. ఈ సుజుకి స్కూటర్ ధర రూ. 85,500 ఎక్స్-షోరూమ్. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, జీపీఎస్ సపోర్ట్, ఫోన్, మెసేజ్ అలర్ట్‌లు, వాట్సాప్ నోటిఫికేషన్లు తెలిపేలా సాంకేతికత ఉంది. ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్ ఉంటుంది.

టీవీఎస్ జుపిటర్ జెడ్‌ఎక్స్ స్మార్ట్ ఎక్సోనెట్.. ఈ స్కూటర్ ధర రూ. 87,938 ఎక్స్-షోరూమ్. దీనిలో బ్లూటూత్ కనెక్టివిటీ, వాయిస్ హెల్ప్, నావిగేషన్ సపోర్ట్, ఫోన్, ఎస్‌ఎంఎస్ నోటిఫికేషన్‌లు చూపేందుకు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే ఉంటుంది. ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్ కూడా ఉంటుంది.

యమహా ఫ్యాసినో 125..ఈ యమహా స్కూటర్ ధర రూ. 89,230 ఎక్స్-షోరూమ్. మార్కెట్లో ఉన్న తేలికైన స్కూటర్లలో ఇది ఒకటి. బ్లూటూత్ కనెక్షన్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్ మోటార్ జనరేటర్, ఆటో స్టార్ట్, స్టాప్, కాల్, మెసేజ్ నోటిఫికేషన్లు చూసుకునేలా ఏర్పాట్లు ఉంటాయి.





























