- Telugu News Photo Gallery Business photos Government extends subsidy duration on electric two wheelers till 2024
Electric Wheeler: కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. ఎలక్ట్రిక్ వాహనాలకు ఇచ్చే సబ్సిడీ గడువు పెంపు
Electric Wheeler: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలోనే వాహనదారులకు సబ్సిడీని అందించే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే..
Updated on: Jul 01, 2021 | 5:57 AM

Electric Wheeler: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలోనే వాహనదారులకు సబ్సిడీని అందించే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇందులో భాగంగా విద్యుత్‌తో నడిచే వాహనాలను కొనుగోలు చేసే వారికి సబ్సిడీని అందిస్తున్నారు. సబ్సిడీ అందించేందుకు కేంద్ర సర్కార్ గతంలో మార్చి 31, 2022ను డెడ్‌లైన్‌గా ప్రకటించింది. కానీ ఆ గడువును ఇప్పుడు మళ్లీ పెంచింది కేంద్రం.

ఎలక్ట్రిక్ వాహనాలకు కేంద్రం అందిస్తున్న సబ్సిడీకి గడువును పెంచింది. మార్చి 31, 2022 వరకు ఉన్న గడువును మార్చి 31,2024 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

కాగా, ఫేమ్ 2 స్కీమ్ కింద కొత్త ఎలక్ట్రిక్ టూవీలర్లకు అందిస్తున్న సబ్సిడీని 50 శాతం వరకు కేంద్రం పెంచింది. ఈ క్రమంలో ప్రతి కిలోవాట్ అవర్‌కు రూ.15 వేల వరకు సబ్సిడీ లభించనుంది. దీంతో హీరో, టీవీఎస్ వంటి కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల ధరలను తగ్గించాయి.

2019లో కేంద్ర సర్కార్ ఫేమ్ 2 స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. దీని కింద ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహిస్తారు. అందుకు గాను అప్పట్లో రూ.10వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. ఇక ఈ స్కీమ్ కింద గంటకు 40 కిలోమీటర్ల మీటర్ల వేగంటతో వెళ్తూ 80 కిలోమీటర్ల మైలేజీని ఇచ్చే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీని అందిస్తారు.





























