- Telugu News Photo Gallery Business photos Good news for car buyers.. No processing fee on car loans in these three banks..!
Car Loans: కారు కొనేవాళ్లకు శుభవార్త.. ఈ మూడు బ్యాంకుల్లో కారులోన్లపై నో ప్రాసెసింగ్ ఫీజ్..!
సొంతిల్లు, సొంత కారు ఇది ప్రతి మధ్యతరగతి ప్రజల కల. అందువల్ల వీటిని నెరవేర్చుకోవడానికి పొదుపుపై ఆధారపడతారు. ఇంటి సంగతి ఎలా ఉన్నా తక్షణ అవసరం కింద కారును కొనాలనే తలంపుతో ఈఎంఐ ఆప్షన్‌పై కారును కొనుగోలు చేయాలని ఆశపడతాడు. ఇలా కొనుగోలు చేసే సమయంలో వివిధ రకాల ఫీజులతో వినియోగదారులను భయపెడతారు. ఒక్కోసారి ఈ ఫీజుల దెబ్బకు కారు కొనాలనే ఆలోచనను కూడా విరమించుకుంటారు. అయితే కొన్ని బ్యాంకుల ప్రస్తుత పండుగ సీజ్‌లో జీరో ప్రాసెసింగ్ ఫీజులతో కారు లోన్లు అందిస్తున్నాయి. మరికొన్ని బ్యాంకులు కారు లోన్ల ప్రాసెసింగ్ ఫీజులపై రాయితీను ప్రకటిస్తున్నాయి. ఆ బ్యాంకులు ఏంటో? ఓసారి తెలుసుకుందాం.
Updated on: Oct 22, 2023 | 7:46 PM

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కారు రుణంపై వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంది. ఎస్‌బీఐ కార్ లోన్‌పై 8.65 శాతం నుంచి 9.70 శాతం వార్షిక వడ్డీని వసూలు చేస్తోంది. పండుగ సీజన్‌లో కార్ లోన్‌పై ప్రాసెసింగ్ ఫీజును కూడా ఎస్‌బీఐ సున్నాకి తగ్గించింది.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి కారు రుణం తీసుకుంటే, మీరు 8.75 శాతం నుండి 10.50 శాతం వరకు వడ్డీని చెల్లించాలి. బ్యాంకు ప్రాసెసింగ్ ఫీజుగా వెయ్యి రూపాయలు వసూలు చేస్తోంది.

దేశంలో ఈ పండుగ సీజన్‌లో యుకో బ్యాంక్ అతి తక్కువ రేటుకు కారు రుణాన్ని అందిస్తోంది. బ్యాంకు ఏడాదికి 8.45 శాతం నుంచి 10.55 శాతం వడ్డీని వసూలు చేస్తుంది. అలాగే యుకో బ్యాంకు లోన్ ప్రాసెసింగ్ ఫీజు లేకుండా రుణాన్ని మంజూరు చేస్తుంది.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రస్తుతం 8.70 శాతం నుంచి 13 శాతం వార్షిక వడ్డీకి కార్ లోన్‌లను అందిస్తోంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా కార్ లోన్‌పై ఎటువంటి ప్రాసెసింగ్ రుసుమును వసూలు చేయడం లేదు

బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రస్తుతం 8.70 శాతం నుంచి 12.10 శాతానికి కార్ లోన్‌ను అందిస్తోంది. మీరు బ్యాంకుకు లోన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ. 500 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.




