- Telugu News Photo Gallery Business photos Good news for Bullet lovers, Classic 350 with new update, Royal Enfield Classic 350 details in telugu
Royal Enfield Classic 350: బుల్లెట్ బండి ప్రియులకు గుడ్ న్యూస్.. నయా అప్‌డేట్‌తో క్లాసిక్ 350
మన దేశంలో బుల్లెట్టు బండికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రతి ఒక్కరూ దీనికి నడపడానికి ఎంతో ఆసక్తి చూపుతారు. ఇక సినిమాాలలో ఈ బండికి ప్రత్యేకంగా పాటలే ఉన్నాయి. అవన్నీ విజయవంతమయ్యాయి కూడా. రాయల్ ఎన్ ఫీల్డ్ కంపెనీ తన ప్రసిద్ద మోడళ్లకు అప్ గ్రేడ్ వెర్షన్లు తయారు చేేసేందుకు ప్రణాళిక రూపొందించింది. దీనిలో భాగంగా మొదటగా రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350ను అప్ డేట్ చేసింది.
Updated on: Aug 04, 2024 | 12:30 PM

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ఇటీవల గెరిల్లా 450 మార్కెట్ లోకి విడుదలైంది. ఇప్పుడు అవుట్ గోయింగ్ మోటార్‌సైకిల్‌ను అప్‌డేట్ చేయడం ప్రారంభించింది.

క్లాసిక్ 350 గురించి విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లను ఉండవచ్చు. ఇతర మోటార్ సైకిళ్లలో ఉపయోగించిన ఎల్ ఈడీ హెడ్‌ల్యాంప్, సిగ్నల్స్, టెయిల్ ల్యాంప్‌లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కొత్త రంగులతో బండిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

రాయల్ ఎన్‌ఫైల్డ్ క్లాసిక్ 350 బుల్లెట్ లో 349 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. ఇది 20.2 బీహెచ్ పీ శక్తి, 27 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను 4000 ఆర్ పీఎమ్ వద్ద పునరుద్ధరిస్తుంది. ఈ పవర్ యూనిట్ 5 స్పీడ్ యూనిట్‌కు జత చేశారు.

రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350 ధర రూ. 1.93 లక్షల నుంచి రూ. 2.25 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంది. దీనిలో ఫ్యూయల్ గేజ్, ట్రిప్ మీటర్లు, ఎకో ఇండికేటర్, సర్వీస్ ఇండికేటర్ కోసం డిజిటల్ రీడౌట్‌తో అనలాగ్ స్పీడోమీటర్ ఏర్పాటు చేశారు. మొబైల్ ఫోన్‌లను చార్జింగ్ చేసుకోవడానికి యూఎస్ బీ పోర్ట్‌ను కూడా ఉంది.

అప్‌డేటెడ్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కొత్త వెర్షన్‌ను ఆగస్టు 12 న దేశంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది.




