- Telugu News Photo Gallery Business photos Gold Price: Will gold prices fall further after September 22 .. Is this the reason?
Gold Price: సెప్టెంబర్ 22 తర్వాత బంగారం ధరలు మరింతగా దిగిరానున్నాయా..? కారణం ఇదేనా..?
Gold Price: బంగారం.. ఇది మహిళ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు మాత్రం ఆగవు. భారతీయ సాంప్రదాయంలో పసిడికి ఎంతో ప్రాముఖ్యతనిస్తుంటారు..
Updated on: Sep 20, 2021 | 8:53 PM

Gold Price: బంగారం.. ఇది మహిళ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు మాత్రం ఆగవు. భారతీయ సాంప్రదాయంలో పసిడికి ఎంతో ప్రాముఖ్యతనిస్తుంటారు. అయితే బంగారం ధరలు కొన్ని రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో చాలా మంది బంగారం కొనేందుకు ముందుకొస్తుంటారు.

ఇక బంగారం కొనుగోలు చేసేవారు మరో 2 రోజులు వాయిదా వేసుకోండి. ఎందుకంటే.. పసిడి ధరలు మరింతగా దిగి రానున్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. మన దేశంలో బంగారం రేట్లను అంతర్జాతీయ మార్కెట్‌లోని పరిస్థితులు కంట్రోల్ చేస్తాయి. అమెరికా డాలర్, జాబ్ డేటా, రిటైల్ గణంకాలు వంటివి పసిడి రేట్లను ప్రభావితం చేస్తాయి.

సెప్టెంబర్ 21, 22 తేదీల్లో అమెరికా ఫెడరల్ రిజర్వు మీటింగ్ జరుగుతుంది. ఇందులో ఫెడ్ తీసుకునే నిర్ణయంపై కూడా బంగారం ధర కదలికలు ఆధారపడి ఉంటాయి. రానున్న రోజుల్లో వడ్డీ రేట్ల పెంపు లేదంటే బాండ్ల కొనుగోలు తగ్గింపు వంటి నిర్ణయాలు తీసుకుంటే.. బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అయితే ఈ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో ఎవ్వరు చెప్పలేం.

ఇదే జరిగితే బంగారం ధర మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అందుకే వినియోగదారులు పసిడి కొనుగోలు చేయాలనుకుంటే ఓ రెండు రోజులు ఆగితే బాగుంటుంది.





























