- Telugu News Photo Gallery Business photos Earnings in lakhs with Biryani leaf cultivation.. government support
Biryani Leaf: బిర్యానీ ఆకు సాగుతో లక్షల్లో సంపాదన.. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం..!
Biryani Leaf: అమెరికా, యూరప్, భారతదేశం సహా అనేక దేశాలలో అనేక రకాల వంటకాలు చేసేటప్పుడు బిర్యానీ ఆకులను ఉపయోగిస్తారని విషయం అందరికి తెలిసిందే...
Updated on: Nov 30, 2021 | 1:59 PM

Biryani Leaf: అమెరికా, యూరప్, భారతదేశం సహా అనేక దేశాలలో అనేక రకాల వంటకాలు చేసేటప్పుడు బిర్యానీ ఆకులను ఉపయోగిస్తారని విషయం అందరికి తెలిసిందే. ఈ బిర్యానీ ఆకు పంట ద్వారా కూడా మంచి లాభాలు పొందవచ్చు.

కేవలం 50 మొక్కలు నాటడం ద్వారా మీరు దాని ఆకుల నుండి ప్రతి ఏడాది రూ.1.50 లక్షల నుండి 2.50 లక్షల రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం కూడా మీకు సహాయం చేస్తుంది. ఈ పంట సాగు కోసం మొదట్లో కష్టపడాల్సి ఉంటుంది. మొక్క పెరిగేకొద్దీ మాత్రమే జాగ్రత్త తీసుకోవాలి.

ఈ బిర్యానీ ఆకు సాగులో ప్రభుత్వం 30 శాతం సబ్సిడీ అందిస్తుంది. దీనికి మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంది. అయితే బిర్యానీ ఆకును పండించడం చాలా సులభం. అదనంగా, దాని సాగు కూడా చాలా చౌకగా ఉంటుంది. రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందవచ్చు.

బిర్యానీ ఆకుల సాగును ప్రోత్సహించేందుకు జాతీయ ఔషధ మొక్కల బోర్డు ద్వారా 30 శాతం సబ్సిడీని రైతులకు అందజేస్తారు. ఒక అంచనా ప్రకారం.. ఒక మొక్క ప్రతి సంవత్సరం సుమారు 3000 నుండి 5000 రూపాయల వరకు సంపాదిస్తుందని ఔషద మొక్కల బోర్డు ద్వారా సమాచారం. 50 మొక్కల నుండి ఏడాదికి 1.50 లక్షల నుండి 2.5 లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు.




