Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best 200cc bikes: మీకు 200 సీసీ బైక్ అంటే ఇష్టమా..? ది బెస్ట్ బైక్స్ ఇవే

ప్రస్తుతం ద్విచక్ర వాహనం ప్రతి కుటుంబానికి కనీస అవసరంగా మారింది. వివిధ పనుల కోసం అందరూ వీటిని కొనుగోలు చేస్తున్నారు. పెద్దలు, మహిళలు, యువత ఇలా అన్నివర్గాలను ఆకట్టుకునేలా మోటారు సైకిళ్లు మార్కెట్ లోకి విడుదలవుతున్నాయి. గతంలో 100 సీసీ ఇంజిన్ బైక్ ల హవా నడిచింది. ఇప్పుడు కొత్త 200 సీసీ బైక్ ల వైపు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా యువత వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ వాటి ధర బాగా ఎక్కువ ఉంటుందనే అపోహ చాలా మందిలో ఉంటుంది. అయితే రూ.2 లక్షల్లో ప్రముఖ కంపెనీల 200 సీసీ బైక్ లు మార్కెట్ లో సందడి చేస్తున్నాయి. బెస్ట్ లుక్, నాణ్యమైన పనితీరు, లేటెస్ట్ ఫీచర్లతో ఆకట్టుకున్న బైక్ ల వివరాలు ఇవే..

Srinu

|

Updated on: Nov 16, 2024 | 7:30 PM

బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 మోటారు సైకిల్ సుమారు 41 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. దీనిలోని 199.5 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ నుంచి 24 హెచ్ పీ, 18.74 టార్క్ విడుదల అవుతుంది. ఇంజిన్ కు ఆరు స్పీడ్ గేర్ బాక్స్ జత చేశారు. సస్పెన్షన్ డ్యూటీకి సంబంధించి ముందు వైపు యూఎస్డీ ఫోర్కులు, వెనుక వైపుప మోనోషాక్ సెటప్ ఏర్పాటు చేశారు. ముందు 300 ఎంఎం, వెనుక 230 ఎంఎం డిస్క్ లు ఉన్నాయి. డ్యూయల్ చానల్ ఏబీఎస్ తో అందుబాటులో ఉన్న ఈ బండి ధర రూ.1.54 లక్షలు.

1 / 5
టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీ బైక్ ధర రూ.1.48 లక్షలు. ఇది 200 సీసీ విభాగంలో బెస్ట్ స్పోర్టీ కమ్యూటర్ మోటారు సైకిళ్లలో ఒకటి. దీనిలోని 197.8 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ నుంచి 20 హెచ్ పీ, 17.25 ఎన్ఎం టార్క్ విడుదల అవుతుంది. దీనిలో ఐదు స్పీడ్ గేర్ బాక్స్ అమర్చారు.  ముందువైపు టెలిస్కోపిక్, వెనుకవైపు మోనోషాక్ సెటప్ ఉంది. బ్రేకింగ్ పవర్ విషయానికి వస్తే 270, 240 ఎంఎం డిస్క్ బ్రేకులు ఏర్పాటు చేశారు. డ్యూయల్ చానల్ ఏబీఎస్ తో అందుబాటులోకి వచ్చిన ఈ బైక్ సుమారు 42 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.

2 / 5
హీరో ఎక్స్ ట్రీమ్ 200ఎస్ 4వీ బైక్ 200 సీసీ బైక్ ల జాబితాలో అత్యంత ఆదరణ పొందింది. దీనిలో 199.6 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. దాని నుంచి 18.8 హెచ్ పీ, 17.35 ఎన్ఎం గరిష్ట టార్క్ విడుదల అవుతుంది. ఇంజిన్ కు ఐదు స్పీడ్ టాన్స్ మిషన్ అమర్చారు. ముందు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక వైపు మోనోషాక్ సెటప్ ఉన్నాయి. 276, 220 ఎంఎం డిస్క్ బ్రేకులతో బండి సమర్థంగా ఆగుతుంది. సింగిల్ చానల్ ఏబీఎస్ తో సుమారు 40 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే ఈ బండి రూ,1.41 లక్షలు పలుకుతోంది.

3 / 5
హీరో ఎక్స్ పల్స్ 200 4వీ బైక్ లోని 199.6 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ నుంచి 18.9 హెచ్, 17.35 ఎన్ఎం టార్క్ విడుదల అవుతుంది.  దీనికి ఐదు స్పీడ్ గేర్ బాక్స్ జత చేశారు. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక వైపు స్వింగార్మ్ మోనోషాక్ సెట్ అమర్చారు. సింగిల్ చానల్ ఏబీఎస్ తో వస్తున్న ఈ బైక్ సుమారు 33 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. రెండు రకాల వేరియంట్లలో రూ.1.47 లక్షలు, రూ.1.54 లక్షల ధరలలో ఈ బండి అందుబాటులో ఉంది.

4 / 5
కేటీెఎం 200 డ్యూక్ బైక్ లో 199.5 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. దీని నుంచి 24 హెచ్ పీ, 19.3 ఎన్ఎం గరిష్ట టార్క్ విడుదల అవుతుంది. ఇంజిన్ కు ఆరు స్పీడ్ గేర్ బాక్స్ జత చేశారు. ముందు భాగంలోయూఎస్ డీ ఫోర్కులు, వెనుక వైపు మోనోషాక్ సెటర్ ఉన్నాయి. బ్రేకుల విషయానికి వస్తే ముందు 300 ఎంఎం, వెనుక 230 ఎంఎం డిస్క్ బ్రేకులు ఏర్పాటు చేశారు.  డ్యూయల్ చానల్ ఏబీఎస్ అమర్చిన ఈ బైక్ 35 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. దీని ధర రూ.1.98 లక్షలు.

5 / 5
Follow us
ఈ సుకుమారి స్పర్శతో ఆ చీర పునీతం అయింది.. మెస్మరైజ్ అనన్య..

43 బంతుల్లో 0 పరుగులు 4 వికెట్లు.. దుమ్ములేపిన కోహ్లీ దోస్త్

రూల్స్‌ మరింత కఠినం.. ఈ డీలర్లు సిమ్ కార్డులను విక్రయించలేరు!

AI ఫీచర్లతో కూడిన సూపర్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. రూ.30 వేల లోపే..

యష్ సినిమా ఆ విషయంలో ఫస్ట్ ప్రాజెక్ట్..
యష్ సినిమా ఆ విషయంలో ఫస్ట్ ప్రాజెక్ట్..
15 ఏళ్ల తర్వాత డబుల్ సెంచరీ.. క్రికెట్ గాడ్‌కు స్పెషల్ సర్‌ప్రైజ్

పోలీస్‌ కస్టడీకి వల్లభనేని వంశీ.. చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం

వారికి శని దోషం..ఈ పరిహారాలతో శనీశ్వరుడు శాంతించే అవకాశం..!

మరణించిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది..?

సోలో ట్రిప్ సజావుగా.. ఆడవారు మీ ప్రయాణాన్ని ఇలా ప్లాన్ చేస్కోండి