- Telugu News Photo Gallery Business photos Checking LIC Policy Status through WhatsApp, Policy information in your hands in simple tips, LIC Policies details in telugu
LIC Policies: వాట్సాప్ ద్వారా ఎల్ఐసీ సేవలు షురూ.. సింపుల్ టిప్స్‌లో మీ చేతుల్లోనే పాలసీ ఇన్‌ఫర్మేషన్
భారతదేశంలో జీవిత బీమా అంటే అందరికీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ఠక్కున్న గుర్తు వస్తుంది. ఎల్ఐసీ పాలసీ తీసుకుంటే జీవిత బీమాతో పాటు పెట్టుబడికి భరోసా ఉంటుందనే నమ్మకం అందరికీ ఉంది. ఈ నేపథ్యంలో పెరిగిన టెక్నాలజీకు అనుగుణంగా పాలసీదారులకు అందుబాటులో ఉండేలా ఎల్ఐసీ వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. కాబట్టి ఎల్ఐసీ వాట్సాప్ సేవల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
Updated on: Dec 15, 2024 | 6:08 PM

ఎల్ఐసీ సేవలను పొందేందుకు పాలసీదారులు ముందుగా ఎల్ఐసీ అధికారిక సైట్‌లో నమోదు చేసుకోవాలి. వాట్సాప్‌లో ఎల్ఐసీ వినియోగదారులకు 24/7 ఇంటరాక్టివ్ సర్వీస్ అందుబాటులో ఉంది. ఇందులో బీమా సంస్థ 11 కంటే ఎక్కువ సేవలను అందిస్తుంది.

ఎల్ఐసీ వాట్సాప్ సేవల్లో లోన్ అర్హత, రీపేమెంట్ అంచనాలు, పాలసీ స్టేటస్, బోనస్ సమాచారం, యూనిట్‌ల స్టేట్‌మెంట్, ఎల్ఐసీ సేవలకు లింక్‌లు, ప్రీమియం గడువు తేదీల అప్‌డేట్‌లు, లోన్ వడ్డీ గడువు తేదీ నోటిఫికేషన్‌లు, చెల్లించిన ప్రీమియంల కోసం సర్టిఫికెట్లు వంటి వివరాలను తెలుసుకోవచ్చు.

మీ ఫోన్‌లో ఎల్ఐసీ అధికారిక వాట్సాప్ నంబర్‌ను 89768 62090ను సేవ్ చేయాలి. అనంతరం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎల్ఐసీ నంబర్‌కరు 'హాయ్' పంపాలి. ఎల్ఐసీ అందించే 11 సేవల్లో ఒకదాన్ని ఎంచుకోవచ్చు.

సేవల ఎంపిక కోసం మీకు అందించిన ఎంపిక నంబర్‌తో చాట్‌లో ప్రత్యుత్తరం ఇవ్వాలి. వాట్సాప్ చాట్‌లో మీ ప్రశ్నకు సంబంధించిన వివరాలను ఎల్ఐసీ షేర్ చేస్తుంది.

అలాగే మీరు మూడు-దశల ప్రక్రియను అనుసరించడం ద్వారా ప్రీమియర్ సేవల కోసం నమోదు చేసుకోవచ్చు. ఎల్ఐసీ వెబ్‌సైట్ ప్రకారం వారి సొంత బీమా లేదా వారి మైనర్ పిల్లల బీమా పాలసీని కలిగి ఉన్న ఏ కస్టమర్‌లు అయినా ఈ సేవలను పొందవచ్చు.




