- Telugu News Photo Gallery Business photos Car Loan Offers: Check here which bank offers the lowest interest rate to buy a car loan
Car Loan Offers: తక్కువ వడ్డీ రేటుతో కారు లోన్ ఆఫర్ చేస్తున్న బ్యాంకులు ఇవే.. కొనేందుకు మంచి అవకాశం..
Updated on: Mar 22, 2023 | 8:31 AM

ఈ రోజుల్లో బ్యాంకులు కూడా చాలా తక్కువ డాక్యుమెంట్లతో కస్టమర్లకు కార్ లోన్‌లను అందిస్తున్నాయి. రెపో రేటులో నిరంతర పెరుగుదల కారణంగా కార్ లోన్ వడ్డీ రేట్లలో నిరంతర పెరుగుదల కనిపించింది. ఇలాంటి సమయంలో ఏ బ్యాంకు నుంచి రుణం తీసుకోవలి.. ఎక్కడ కారు కొనేందుకు తక్కువ వడ్డితో రుణం దొరుకుతుందో తెలుసుకుందాం.

అటువంటి సమయంలో కస్టమర్లకు తక్కువ వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ రుసుములతో కార్ లోన్‌లను అందిస్తున్నాయి. ఇందులో ఈ ఐదు బ్యాంకులు ముందు వరసలో ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

బ్యాంక్ ఆఫ్ బరోడా తన కస్టమర్లకు 8.70 శాతం వడ్డీ రేటుతో కారు రుణాన్ని అందిస్తోంది. రూ.1 కోటి రుణంపై బ్యాంక్ 0 ప్రాసెసింగ్ రుసుమును వసూలు చేస్తోంది.

కెనరా బ్యాంక్ తన కస్టమర్లకు 9.15 శాతం ప్రారంభ రేటుతో కారు రుణాలను అందిస్తోంది. ఇందులో కస్టమర్లు కారు లోన్‌పై ప్రాసెసింగ్ ఫీజుగా రూ.1,000 నుంచి రూ.5,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది.

యాక్సిస్ బ్యాంక్ తన కస్టమర్లకు 8.55 శాతం చొప్పున కారు రుణాన్ని అందిస్తోంది. కస్టమర్లు రుణంపై ప్రాసెసింగ్ ఫీజుగా కనీసం రూ.3,500 నుంచి రూ.7,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది.

ప్రైవేట్ రంగ బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ 11 శాతం చొప్పున కార్ లోన్‌ను అందిస్తోంది. ఈ రుణాన్ని పూర్తి 84 నెలల పాటు తీసుకోవచ్చు.

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అంటే SBI తన కస్టమర్లకు 8.60 శాతం చొప్పున కారు రుణాన్ని అందిస్తోంది. ఈ లోన్‌పై కస్టమర్ల నుంచి బ్యాంక్ 0 ప్రాసెసింగ్ రుసుమును వసూలు చేస్తోంది.

కారుపై రుణం మొత్తం దాని విలువలో 50 నుండి 150 శాతం ఉంటుంది. కారుపై రుణం కాలవ్యవధి 12 నెలల నుండి 84 నెలల వరకు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో, రుణ కాలపరిమితిని కూడా పొడిగించవచ్చు.




