- Telugu News Photo Gallery Business photos Jio continues true 5G rollout by announcing launch in 41 more cities and extending its reach to over 406 citie
Jio True 5G: 406 నగరాల్లో జియో ట్రూ 5జీ.. ఏపీలోని మరిన్ని నగరాల్లో ఈ సేవలు ప్రారంభం.. ఎక్కడెక్కడ అంటే..
రిలయన్స్ జియో 5జీ సేవల్లో దూసుకుపోతోంది. దేశంలో 5జీ సేవలు ప్రారంభం కావడంతో ఆయా రాష్ట్రాల్లో పలు టెలికాం కంపెనీలు దూకుడు ప్రారంభించాయి..
Updated on: Mar 22, 2023 | 4:41 PM

రిలయన్స్ జియో 5జీ సేవల్లో దూసుకుపోతోంది. దేశంలో 5జీ సేవలు ప్రారంభం కావడంతో ఆయా రాష్ట్రాల్లో పలు టెలికాం కంపెనీలు దూకుడు ప్రారంభించాయి. అయితే రిలయన్స్ జియో మాత్రం ఇతర నెట్‌వర్క్‌లకంటే దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లోని నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి తీసుకురాగా, ఇప్పుడు మరిన్ని నగరాల్లో సేవలను ప్రారంభింస్తోంది.

కొత్తగా మరో 41 నగరాల్లో జియో ట్రూ 5జీ సేవలను ప్రారంభించింది. ఇప్పటి వరకు దేశంలో 406 నగరాల్లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది.

జియో ట్రూ 5జీ సేవలు ఇప్పుడు 16 రాష్ట్రాల్లోని 41 అదనపు నగరాల్లో అందుబాటులో ఉంటుంది. అయితే ఇందులో తెలుగు రాష్ట్రాల్లో అయితే ఏపీలోని కొన్ని నగరాల్లో ఈ సేవలను ప్రారంభించింది జియో.

ఏపీ రాష్ట్రంలోని ఆదోని, బద్వేల్, చిలకలూరిపేట, గుడివాడ, కదిరి, నర్సాపూర్, రాయచోటి, శ్రీకాళహస్తి, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో జియో ట్రూ 5జీ సేవలు ప్రారంభించినట్లు జియో తెలిపింది.

ఈ ఏడాది చివరినాటికి దేశంలోని అన్ని నగరాల్లో జియో 5జీ సేవలు అందుబాటులోకి తీసుకురాన్ననట్లు జియో తెలిపింది. మార్చి 21, 2023 నుంచి కొత్తగా ప్రారంభించిన 41 నగరాల్లోని జియో వినియోగదారులు జియో వెల్‌కమ్ ఆఫర్ అందుబాటులోకి తీసుకువచ్చింది.





























