- Telugu News Photo Gallery Top 5 cheapest bikes with dual channel abs system from tvs apache rtr 200 to yamaha fz 25
స్టైలిష్ ఫీచర్లు, అధిక మైలేజ్‌తో చౌకైన ధరలో అద్దిరిపోయే స్పోర్ట్స్ బైక్స్ ఇవే.. మీరూ లుక్కేయండి..
సేఫ్ డ్రైవింగ్ కోసం డ్యూయల్-ఛానల్ ABSతో కూడిన బైక్‌లను కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే చౌకైన 5 బైక్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందామా..!
Updated on: Mar 21, 2023 | 1:41 PM

యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ABS) అనేది వాహనాల్లో ఉండే సేఫ్టీ ఫీచర్. ఇది చక్రాలు లాక్ అవ్వకుండా నిరోధించడమే కాదు.. సురక్షితమైన బ్రేకింగ్‌ను అనుమతిస్తుంది. మరి సేఫ్ డ్రైవింగ్ కోసం డ్యూయల్-ఛానల్ ABSతో కూడిన బైక్‌లను కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే చౌకైన 5 బైక్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందామా..!

బజాజ్ పల్సర్ ఎన్160: బజాజ్ పల్సర్ ఎన్160 ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.30 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. వివిధ కలర్ వేరియంట్లలో లభించే ఈ బైక్.. బ్రూక్లిన్ బ్లాక్ కలర్ మోడల్‌లో మాత్రమే డ్యూయల్-ఛానల్ ABS సిస్టమ్ అందుబాటులో ఉంది. అలాగే పూర్తి డిస్క్ బ్రేక్‌లతో మీరు ఈ స్పోర్ట్స్ బైక్ పొందొచ్చు.

బజాజ్ పల్సర్ NS160: బజాజ్ పల్సర్ NS160 బైక్ 160 CC సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్ ఇంజిన్‌తో వస్తోంది. ట్రాన్స్‌మిషన్ కోసం, దీనికి 5 స్పీడ్ గేర్‌బాక్స్ అమర్చబడి ఉంది. ఈ మోడల్ బైక్‌లో డ్యూయల్-ఛానల్ ABS బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.35 లక్షలు.

TVS Apache RTR 200 4V మోడల్ బైక్‌కు డ్యూయల్-ఛానల్ ABS సిస్టమ్, రేర్ వీల్ లిఫ్ట్ ఆఫ్ ప్రొటెక్షన్ (RLP) కూడా అందుబాటులో ఉంది. ఈ మోడల్ అపాచీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.40 లక్షల నుంచి 1.45 లక్షల వరకు ఉంది.

బజాజ్ పల్సర్ NS200: బజాజ్ పల్సర్ మరొక మోడల్ NS200కి డ్యూయల్-ఛానల్ ABS సిస్టం అమర్చబడి ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.47 లక్షలు. ఈ బైక్ 199.5 CC సింగిల్-సిలిండర్ లిక్విడ్ కూల్ ఇంజిన్ శక్తితో వస్తోంది. దీనికి 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లభిస్తుంది.

యమహా ఎఫ్‌జెడ్25 అనేది డ్యూయల్-ఛానల్ ABS సిస్టమ్‌తో కూడిన డ్యాషింగ్ బైక్. దీని ముందు, వెనుక చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ఈ బైక్ 249 CC ఎయిర్ కూల్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ శక్తిని ఇస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తోంది.





























