- Telugu News Photo Gallery Business photos Business Ideas: Make Money Benefits With Mushrooms Business In Your Town
Business Ideas: ఉన్న ఊర్లోనే ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టండి.. రూ. 5 వేల పెట్టుబడితో లాభాలే లాభాలు.!
ఈ మధ్యకాలంలో ఉద్యోగాల మీద కంటే వ్యాపారాల మీదే చాలామంది దృష్టి పెడుతున్నారు. మరి మీరు కూడా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలని చూస్తున్నారా.?
Updated on: Apr 26, 2023 | 1:45 PM

ఈ మధ్యకాలంలో ఉద్యోగాల మీద కంటే వ్యాపారాల మీదే చాలామంది దృష్టి పెడుతున్నారు. మరి మీరు కూడా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలని చూస్తున్నారా.? తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు ఆశిస్తున్నారా.? అయితే ఎటువంటి రిస్క్ లేని ఈ బిజినెస్ ఐడియా ఏంటో చూసేద్దామా..!

ఆ బిజినెస్ మరేదో కాదు.. పుట్టగొడుగుల వ్యాపారం. పుట్టగొడుగులతో మనం ఇంటి నుంచి మంచి లాభాలు సంపాదించవచ్చు. ఇటీవల చాలామంది యువత పౌష్టికాహారంపైనే దృష్టి పెడుతున్నారు. ఇక పుట్టగొడుగుల్లో శరీరానికి కావాల్సిన పోషక పదార్ధాలు చాలానే ఉన్నాయి. అందుకే మీరు ఈ పుట్టగొడుగుల వ్యాపారాన్ని ఎలాంటి రిస్క్ లేకుండా మొదలుపెట్టి.. మంచి రాబడి తెచ్చుకోవచ్చు.

ఈ పుట్టగొడుగుల బిజినెస్‌కు పెట్టుబడిగా రూ. 5 వేలు సరిపోతుంది. మీ ఇంటిలోనే పుట్టగొడుగుల సాగును ప్రారంభించవచ్చు. ఇందుకోసం మీ ఇంట్లో ఓ పెద్ద రూమ్ ఉంటే చాలు. మార్కెట్‌లో కంపోస్ట్ దొరుకుతుంది.

కేవలం 20 నుంచి 25 రోజుల్లో పుట్టగొడుగులు పెరగడం మొదలవుతాయి. ఇక ప్రస్తుత మార్కెట్‌లో కేజీ పుట్టగొడుగులు రూ. 100 నుంచి 150 వరకు పలుకుతోంది. ఇక రిటైల్ మార్కెట్‌లో అయితే పుట్టగొడుగుల 200 గ్రాముల ప్యాకెట్ రూ. 40గా ఉంది.

మీరు ఇలా అంచలంచలుగా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. స్థానికంగా ఉండే రిటైల్ షాపులతో మాట్లాడుకోవడమే కాదు, మౌత్ పబ్లిసిటీని కూడా పెంచితే.. కొద్దిరోజుల్లోనే ఈ వ్యాపారం ద్వారా మీరు మంచి లాభాలు పొందొచ్చు.





























