- Telugu News Photo Gallery Business celebs radhika merchant flaunt her luxurious bag know the price Telugu News
వామ్మో అంత ధర..! అంబానీ వారి కోడలి హ్యాండ్ బ్యాగ్ ఖర్చుతో మనం ఏకంగా ఫ్లాటే కొనేయొచ్చు..
ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీకి కాబోయే భార్య అయిన రాధికా మర్చంట్. ప్రస్తుతం తన అదిరిపోయే లుక్స్ కారణంగా వార్తల్లో కెక్కారు.. అయితే ఈలోగా ఆమె అబు జానీ సందీప్ ఖోస్లా పార్టీలో కనిపించింది.
Updated on: Mar 04, 2023 | 9:09 PM

ముఖేష్ అంబానీ చిన్న కోడలు రాధికా మర్చంట్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఆమె వ్యాపార వనితగా మాత్రమే కాదు..ఫ్యాషన్‌లోనూ ముందంజలో ఉన్నారు.

ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీకి కాబోయే భార్య అయిన రాధికా మర్చంట్. ప్రస్తుతం తన అదిరిపోయే లుక్స్ కారణంగా వార్తల్లో కెక్కారు.. అయితే ఈలోగా ఆమె అబు జానీ సందీప్ ఖోస్లా పార్టీలో కనిపించింది.

అబు జానీ సందీప్ ఖోస్లా మేరా నూర్ హై మషూర్ అనే పార్టీని ఏర్పాటు చేశారు. ఇందులో రాధిక మర్చంట్ కూడా పాల్గొన్నారు. ఆమె అందమైన రూపాన్ని చూసి అందరూ నోరెళ్లబెట్టారంటే అతిశయోక్తి కాదు.

దీనితో పాటు, రాధిక మర్చంట్ స్టైల్‌ని చూసి ప్రతి ఒక్కరూ తమ చూపుతిప్పుకోలేకపోయారు. అయితే, ఈ పార్టీలో చాలా మంది అభిమానుల దృష్టి ఆమె అందమైన బ్యాగ్ వైపు మళ్లింది.

రాధిక మర్చంట్ తన దుస్తులకు సరిపోయేలా పింక్ కలర్ బ్యాగ్‌ని తీసుకువెళ్లారు. ఇది బబుల్‌గమ్ బ్యాగ్. ఇది హెర్మేస్ బ్రాండ్ కెల్లీ మినీ బ్యాగ్. ఇది కూడా చాలా స్టైలిష్‌గా కనిపించింది.

హెర్మెస్ వెబ్‌సైట్‌లో చూస్తే, రాధిక పింక్ కలర్ బ్యాగ్ ధర $58,600 గా ఉంది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం ఆమె ధరించిన బ్యాగ్ దాని విలువ రూ. 48 లక్షలు.




