Budget Trips in India: మార్చి నెలలో చూడవలసిన పర్యాటక ప్రదేశాలు.. గోవా నుండి రిషికేశ్ వరకు మీ బడ్జెట్‌లోనే..
ఆహ్లాదకరమైన వాతావరణంలో భారత దేశంలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు మార్చి నెల ఉత్తమమైనది. ఈ నెలలో దేశవ్యాప్తంగా వాతావరణం ప్రశాంతంగా ఉండి, సెలవులు కూడా రావటంతో పర్యటనలు చేయటానికి అనుకూలంగా ఉంటుంది. భారత దేశంలో ఎన్నో ప్రదేశాలు ఉన్నప్పటికీ మార్చి నెలలో చూడవలసిన పర్యాటక ప్రదేశాలు కొన్నే ఉన్నాయి. గోవా నుండి రిషికేశ్ వరకు మీ బడ్జెట్‌లో ఫ్రెండ్లీ టూర్స్‌గా చెప్పదగినవి కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మీకు కావలసినంత వినోదాన్ని, విశ్రాంతిని పొందవచ్చు.
Updated on: Feb 21, 2023 | 12:35 PM

గోవా: ఇది ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటం, రద్దీ తక్కువగా ఉండటంతో మార్చి నెల సందర్శనకు అనువైన సమయం. మీరు గోవాలో అందమైన బీచ్‌లు, వాటర్ స్పోర్ట్స్ , నైట్ లైఫ్‌ని ఎంజాయ్ చేయొచ్చు.

హంపి, కర్ణాటక: హంపి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ప్రసిద్ధ బ్యాక్‌ప్యాకర్ గమ్యస్థానం. ఇది పురాతన శిధిలాలు, దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. ఇది భారతదేశం గొప్ప చరిత్ర, సంస్కృతి సంగ్రహావలోకనం అందిస్తుంది.

జైపూర్, రాజస్థాన్: "పింక్ సిటీ"గా పిలువబడే జైపూర్ అనేక చారిత్రాత్మక కోటలు, రాజభవనాలతో సజీవమైన, రంగుల నగరం. మార్చిలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది సందర్శనకు సరైన సమయం.

Varanasi:ఉత్తర ప్రదేశ్‌లో గంగా నది ఒడ్డున ఉన్న వారణాసి భారతదేశంలోని అత్యంత మతపరమైన ప్రదేశాలలో ఒకటి. దీనిని కాశీ లేదా బనారస్ అని కూడా అంటారు. ఈ పురాతన నగరం హిందువులకు అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి. ఒంటరి మహిళలు ఇక్కడ సాయంత్రం గంగా హారతితో పాటు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన కాశీ విశ్వనాథ దేవాలయం, రుచికరమైన ఆహారం, బోటింగ్ ఆనందించవచ్చు.

రిషికేశ్, ఉత్తరాఖండ్: రిషికేశ్ ఒక ఆధ్యాత్మిక కేంద్రం. యోగా, ధ్యానానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి. ఇది గంగా నది ఒడ్డున ఉంది. చుట్టూ అందమైన కొండలు, అడవులు ఉన్నాయి.





























