Kitchen Cleaning: వంటి గదిని శుభ్రం చేసే సులువైన చిట్కాలు ఇవే..
దీపావళి అంటే వెలుగుల పండుగ. ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నం. ఈ విజయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకుంటారు. దీపావళికి అతిథులు ఇంటికి వస్తారు. అలాంటప్పుడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా వంట గదిని శుభ్రపరచడానికి ఉపయోగపడే 7 చిట్కాలు ఇప్పుడు చూద్దాం. కిచెన్ క్యాబినెట్‌లు, డ్రాయర్‌లను పరిశుభ్రంగా ఉంచుకునేలా చూసుకోవాలంటే.. 6 నెలల నుంచి ఉపయోగించని వస్తువులను పడేయడానికి ప్రయత్నించాలి.
Srikar T |
Updated on: Nov 06, 2023 | 10:39 AM

దీపావళి అంటే వెలుగుల పండుగ. ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నం. ఈ విజయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకుంటారు. దీపావళికి అతిథులు ఇంటికి వస్తారు. అలాంటప్పుడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా వంట గదిని శుభ్రపరచడానికి ఉపయోగపడే 7 చిట్కాలు ఇప్పుడు చూద్దాం.

కిచెన్ క్యాబినెట్‌లు, డ్రాయర్‌లను పరిశుభ్రంగా ఉంచుకునేలా చూసుకోవాలంటే.. 6 నెలల నుంచి ఉపయోగించని వస్తువులను పడేయడానికి ప్రయత్నించాలి. అలాగే, పాడైన వంట సామాన్లను పక్కన పెట్టి మిగిలిన వాటిని క్రమపద్దతిలో అమర్చుకోవాలి. తద్వారా క్లీన్ చేసేటప్పుడు వాటిని తిరిగి అమర్చాల్సిన పని ఉండదు.

పనికిరాని వస్తువులన్నీ పడేసిన తర్వాత కూడా కొన్ని ప్రాంతాల్లో ధుమ్ము పేరుకొని ఉంటుంది. చిమ్నీలు లేదా ఎగ్జాస్ట్‌లలో ఎక్కువ జిడ్డుతో కూడిన ధూళి పేరుకుపోతుంది. వాటిని శుభ్రపరిచేటప్పుడు వాటిని కాసేపు గోరువెచ్చని నీటిలో నానబెట్టడం మంచిది. అందులో బేకింగ్ సోడా, డిష్‌వాష్ సోప్ మిశ్రమాన్ని ఉపయోగించాలి. ఆపై మురికిని స్క్రబ్ చేసి శుభ్రపరచవచ్చు.

బొద్దింకల బెడద నుంచి వంటశాలలను కాపాడుకోవడానికి మనం తిన్న ప్లేటులోని చెత్తను షింక్‌లో వేయకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ తీపి పదార్థాలు ఏవైనా కిచెన్లో కింద పడినట్లైతే వాటిపై క్రిమికీటకాలను చంపే స్ప్రేలను పిచికారీ చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.

వండే సమయంలో కిందపడిన నూనె, ఆవిరి ద్వారా అల్మారాలకు అంటిన జిడ్డు ధూళిని తరచుగా శుభ్రం చేయనందున దట్టంగా పేరుకుపోతుంది. ఇలాంటి మరకలను వదిలించాలంటే గోరువెచ్చని నీటిలో వెనిగర్ కలిపిన మిశ్రమాన్ని ఉపయోగించాలి. ఆ తరువాత చిన్నపాటి టిష్యూ లేదా పొడిబట్టతో శుభ్రం చేయడం వల్ల దట్టంగా పేరుకున్న మరకలు తొలిగిపోతాయి.

నిత్యం ఉపయోగించే కొన్ని పాలు, కూరగాయలు ఎక్కువ కాలం నిలువ ఉండాలంటే ఫ్రిజ్ పాత్ర కీలకం. ఇందులో వండిన పదార్థాలు కూడా పెడుతూ ఉంటాం. ఇందులో పాడైన వాటిని అందులో నుంచి తీసేసి అక్కడ పేరుకున్న మరకలను గోరు వెచ్చని నీటితో శుభ్ర చేయాలి. ఫ్రిజ్ బయటి తలుపుల కోసం మీకు నచ్చిన క్లీనింగ్ లిక్విడ్‌ని ఉపయోగించవచ్చు. అది ఫ్రిజ్‌కి చక్కని మెరుపును కొత్తగా కనిపించేలా చేస్తుంది.

మీ కిచెన్ షింక్ శుభ్రంగా ఉండాలంటే ప్రతి రోజూ కాకపోయినా 15 రోజులకు ఒకసారి మార్కెట్లలో లభించే డిష్ సోప్ లేదా క్లీనింగ్ పౌడర్లను ఉపయోగించవచ్చు. నీళ్లు వెళ్లే పైపులు శుభ్రం చేయడానికి, కొద్దిగా బేకింగ్ సోడా, వేడి నీటిని ఆ పైపుల జాలీల వద్ద పోయాలి. తద్వరా పైపులలో ఏదైనా చెత్త పేర్కొని ఉంటే కొట్టుకొని పోతుంది.





























