Breast Pain: తరచూ బ్రెస్ట్ పెయిన్ వస్తుందా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి..
కొంత మంది మహిళలు రొమ్ము నొప్పితో బాధపడుతుంటారు. దీనిని మాస్టాల్జియా అంటారు. పీరియడ్స్ సమయంలో హార్మోన్ కారణాల వల్ల రొమ్ము నొప్పి వస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ, పీరియడ్స్ కాకుండా ఇతర సమయాల్లో బ్రెస్ట్ పెయిన్ వస్తే మాత్రం తేలికగా తీసుకోకూడదు. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. రొమ్ము నొప్పికి అనేక కారణాలు ఉండవచ్చు. హార్మోన్ల మార్పులతో పాటు.. రొమ్ము తిత్తులు, ఫైబ్రోసిస్టిక్ మార్పులు లేదా కండరాల ఒత్తిడి వల్ల నొప్పి సంభవించవచ్చు. కాబట్టి తరచు వచ్చే బ్రెస్ట్ నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదు..
Updated on: Feb 12, 2024 | 7:41 PM

కొంత మంది మహిళలు రొమ్ము నొప్పితో బాధపడుతుంటారు. దీనిని మాస్టాల్జియా అంటారు. పీరియడ్స్ సమయంలో హార్మోన్ కారణాల వల్ల రొమ్ము నొప్పి వస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ, పీరియడ్స్ కాకుండా ఇతర సమయాల్లో బ్రెస్ట్ పెయిన్ వస్తే మాత్రం తేలికగా తీసుకోకూడదు. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. రొమ్ము నొప్పికి అనేక కారణాలు ఉండవచ్చు. హార్మోన్ల మార్పులతో పాటు.. రొమ్ము తిత్తులు, ఫైబ్రోసిస్టిక్ మార్పులు లేదా కండరాల ఒత్తిడి వల్ల నొప్పి సంభవించవచ్చు. కాబట్టి తరచు వచ్చే బ్రెస్ట్ నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదు.

రొమ్ము నొప్పికి కారణాలలో తిత్తులు ఒకటి. ఇలాంటి సందర్భంలో నొప్పి తీవ్రత సమయంతో పెరుగుతుంది. ఉబ్బరం కూడా అనిపిస్తుంది. పీరియడ్స్ సమయంలో హార్మోన్ల మార్పులు నొప్పిని మరింత తీవ్రతరం చేస్తాయి. కాబట్టి మీకు రెగ్యులర్ బ్రెస్ట్ పెయిన్ ఉంటే, డాక్టర్ వద్దకు తప్పక వెళ్లాలి.

పీరియడ్స్ సమయంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ స్థాయిలు మారుతూ ఉంటాయి. దీని వల్ల పీరియడ్స్ సమయంలో బ్రెస్ట్ పెయిన్ వస్తుంది. అలాగే, ఈ సమయంలో రొమ్ము వాపు, మంట సంభవించవచ్చు. వ్యాయామం చేయడం లేదా ఛాతీకి ఏదైనా ఇతర గాయం లేదా కండరాల ఒత్తిడి వల్ల కూడా రొమ్ము నొప్పి సంభవిస్తుంది. రొమ్ము కణజాలం అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో సాధారణంగా విశ్రాంతితో రొమ్ము నొప్పి తగ్గుతుంది. అయితే కొద్దిరోజుల్లోనే నొప్పి తగ్గకపోతే డాక్టర్‌ని సంప్రదించాలి.

తల్లి పాలు కూడా నొప్పిని కలిగిస్తాయి. రొమ్ములు పాలతో నిండి, ఉబ్బినట్లు, అసౌకర్యంగా అనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో బిడ్డకు తల్లి పాలు ఇస్తున్నప్పుడు చనుమొన నొప్పిని కలిగిస్తుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం బెటర్.

కొన్ని మందుల సైడ్ ఎఫెక్ట్ వల్ల కూడా రొమ్ము నొప్పి సంభవిస్తుంది. ముఖ్యంగా గర్భనిరోధక మాత్రలు వేసుకోవడం వల్ల బ్రెస్ట్ పెయిన్ వస్తుంది. కానీ రొమ్ము నొప్పితోపాటు వేగంగా బరువు తగ్గడం, జలుబు, దగ్గు ఉంటే.. అలాగే కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.




