- Telugu News Photo Gallery Cricket photos All Rounder Ben Stokes One Game Away From Playing 100 Tests For England in Rajkot 3rd test between IND Vs ENG
IND vs ENG: రాజ్‌కోట్‌లో సెంచరీ కొట్టనున్న ఇంగ్లండ్ సారథి.. కట్‌చేస్తే.. సచిన్, కోహ్లీ రికార్డులో చోటు?
IND vs ENG: భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో మూడో మ్యాచ్ ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ టెస్టు క్రికెట్‌లో 100వ మ్యాచ్ ఆడిన రికార్డును లిఖించనున్నాడు. ఇంగ్లండ్ తరపున టెస్టులు, ఇతర ఫార్మాట్లలో ఆల్ రౌండర్‌గా రాణిస్తున్న స్టోక్స్ 114 వన్డేలు, 43 టీ20లు ఆడాడు. ఇంగ్లండ్ గెలిచిన 2019 ODI ప్రపంచ కప్, 2022 T20 ప్రపంచ కప్ స్క్వాడ్‌లలో స్టోక్స్ కూడా భాగం.
Updated on: Feb 12, 2024 | 7:33 PM

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో మ్యాచ్ ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ టెస్టు క్రికెట్‌లో 100వ మ్యాచ్ ఆడిన రికార్డును లిఖించనున్నాడు.

దీని ద్వారా టెస్టు క్రికెట్‌లో 100కు పైగా మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ ఆటగాళ్ల జాబితాలో స్టోక్స్ చేరనున్నాడు.

ఇప్పటివరకు 99 టెస్టు మ్యాచ్‌లు ఆడిన 32 ఏళ్ల స్టోక్స్ ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టులో తన 100వ టెస్టు ఆడనున్నాడు. ఇది సాధ్యమైతే క్రికెట్ చరిత్రలో 100 టెస్టు మ్యాచ్‌లు ఆడిన 74వ క్రికెటర్‌గా స్టోక్స్, ఈ ఘనత సాధించిన 16వ ఇంగ్లండ్ ప్లేయర్‌గా నిలుస్తాడు.

టెస్టు క్రికెట్‌లో స్టోక్స్ ప్రదర్శనను పరిశీలిస్తే.. 2013లో రెడ్ బాల్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన స్టోక్స్ 99 టెస్టు మ్యాచ్‌ల్లో 36.3 సగటుతో 6251 పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు, 31 అర్ధసెంచరీలు ఉన్నాయి.

బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ మ్యాజిక్ చేసిన స్టోక్స్ 32.07 సగటుతో 197 వికెట్లు పడగొట్టాడు. రాజ్‌కోట్ టెస్టులో స్టోక్స్ మూడు వికెట్లు తీస్తే 200 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ తరపున టెస్టుల్లో 200 వికెట్లు తీసిన 16వ బౌలర్‌గా నిలిచాడు.

ఇంగ్లండ్ తరపున టెస్టులు, ఇతర ఫార్మాట్లలో ఆల్ రౌండర్‌గా రాణిస్తున్న స్టోక్స్ 114 వన్డేలు, 43 టీ20లు ఆడాడు. ఇంగ్లండ్ గెలిచిన 2019 ODI ప్రపంచ కప్, 2022 T20 ప్రపంచ కప్ స్క్వాడ్‌లలో స్టోక్స్ కూడా భాగం.




