AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చలికాలంలో పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం..జాగ్రత్త పడకపోతే ముప్పే!

ప్రస్తుతం చాలా మంది బ్రెయిన్ స్ట్రోక్ బారినపడుతున్నారు. ముఖ్యంగా చలికాంలో బ్రెయిన్ స్ట్రోక్ కేసులనేవి 10 శాతం వరకు పెరుగుతున్నాయంట. అందుకే శీతాకాలం సమయంలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. కాగా, ఇప్పుడు మనం బ్రెయిన్ స్ట్రోక్ కేసులు చలికాలంలో పెరగడానికి గల కారణాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Oct 30, 2025 | 7:10 PM

Share
వాతావరణ మార్పు బ్రెయిన్ స్ట్రోక్ పై ప్రభావం చూపుతుందంటున్నారు అహ్మదాబాద్ వైద్యులు. ముఖ్యంగా చలికాలంలో దీని ప్రభావం  ఐదు నుంచి పది శాతం పెరుగుతుందంట. శీతాకాలం సమయంలో ప్రతి రోజూ దాదాపు 35 మంది స్ట్రోక్ బారిన పడటమే కాకుండా వారికి అత్యవసర చికిత్స అవసరం అవుతందని వారు హెచ్చరిస్తున్నారు.

1 / 5
అయితే అసలు చలికాలంలో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు అనేవి ఎందుకు విపరీతంగా పెరుగుతున్నాయి అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. అయితే దీనికి ముఖ్యకారణం జీవనశైలి, ఒత్తిడి, అధిక రక్తపోటు, మధుమేహం , పెరిగిన కొలెస్ట్రాల్ స్థాయిలు ముఖ్య కారణం అని వారు హెచ్చరిస్తున్నారు. అందుకే ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ సరైన జీవనశైలిని అవలంభించాలంట.

2 / 5
అంతే కాకుండా చలికాలంలో బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం పెరగడానికి, చాలా కారణాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో రక్తనాళాలు, కుచించకపోయి, రక్తప్రవాహం మందంగా మారుతుంది. అంతే కాకుండా రక్తం గడ్డ కట్టే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది బ్రెయిన్ స్ట్రోక్‌కు కారణం అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

3 / 5
అదే విధంగా చాలా మంది చలికాలంలో శారీరక శ్రమ తగ్గిస్తారు, ఆహారం విషయంలో మార్పులు చేయడం, మద్యం సేవించడం, జీవన శైలిలో వచ్చే తేడాల వలన ఈ ప్రమాదం అనేది విపరీతంగా పెరుగుతుందంట. ముఖ్యంగా అధిక ఒత్తిడి అనేది బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని తీవ్రతరం చేస్తుందని వారు నొక్కి చెబుతున్నారు.

4 / 5
ఇక ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా చాలా మంది బ్రెయిన్ స్ట్రోక్ బారినపడుతున్నారు. చిన్న వారిలో కూడా ఈ స్ట్రోక్ కేసులు అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి. దాదాపు నలుగురిలో 50 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నవారే స్ట్రోక్ బారినపడుతున్నారు. దీనికి కారణం శారీరక శ్రమ లేకపోవడం, జీవనశైలి కారణం అని చెబుతున్నారు వైద్య నిపుణులు.

5 / 5