- Telugu News Photo Gallery Bitter Gourd Tea: Drink This Drink to Manage Cholesterol And Diabetes Naturally
Bitter Gourd Tea: కాకరకాయ టీ ఎప్పుడైన తాగారా? డయాబెటీస్ రోగులకు అమృతంతో సమానం
కాకర పేరు వినగానే చాలా మందికి డోకు వస్తుంది. అయితే చాలా మంది షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడానికి రోజూ కాకర రసం తీసుకుంటూ ఉంటారు. చేదు తింటే మధుమేహం కంట్రోల్ అవుతుందని చాలా మంది భావిస్తారు. నిజానికి, ఈ చేదు కాకర కాయలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కొలెస్ట్రాల్ నుండి మధుమేహాన్ని వరకు సహజంగా నియంత్రించడానికి ప్రతిరోజూ ఒక కప్పు టీ తాగాలట..
Updated on: Jun 24, 2024 | 9:22 PM

Bitter Gourd

కాకర కాయ ప్రయోజనాలు చాలా ఉన్నాయి. చాలా మందికి కాకర కాయలను ఇష్టపడరు. అయితే దీన్ని కేవలం కూరగాయగా భావించడం తప్పు. ఎందుకంటే ఇందులో చాలా ఔషధ గుణాలున్నాయి. ఇందులో ఫైబర్, విటమిన్ సి, ఫోలేట్, విటమిన్ ఎ అధికంగా ఉంటాయి. కాకర కాయను రోజూ తీసుకోవడం వల్ల మొత్తం ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. కాకర కాయలతో టీ తయారు చేస్తారని చాలా మందికి తెలియదు. కానీ ఈ టీ కొలెస్ట్రాల్, డయాబెటిస్‌కు మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. దీన్ని చాలా సింపుల్‌గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

కాకరకాయలోని యాంటీబాక్టీరియల్ లక్షణాలు సీజనల్ వ్యాధులు రాకుండా కాపాడుతాయి. కాకరకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఉన్నాయి. దీంతో వాపులు తగ్గుతాయి. డయాబెటిస్‌లో ప్రయోజనకరమైనది. జీర్ణక్రియకు ఉత్తమం. బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. లివర్ కు మేలు చేస్తుంది. చర్మ సమస్యలు దూరం చేస్తుంది. కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

కాకర కాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అంతే కాదు, కాకర కాయ టీలో ఉండే విటమిన్ ఎ కారణంగా కంటి చూపు మెరుగుపరుస్తుంది. విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి అవసరం. ఇది సహజంగా కంటి చూపును మెరుగుపరుస్తుంది. కాకర కాయలోని నిర్విషీకరణ గుణాల వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ప్రత్యేక టీ కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది కూడా.

ఎలా తయారు చేసుకోవాలంటే.. బాణలిలో నీటిని మరిగించాలి. దీనిలో ఎండిన కాకరకాయ పొడిని వేసి మీడియం వేడి మీద 10 నిమిషాలపాటు ఉడకనివ్వాలి. ఇలా చేయడం వల్ల కాకరలోని పోషకాలన్నీ నీటిలోకి చేరుతాయి. తర్వాత ఈ నీటిని వడకట్టి ఓ కప్పులో నింపుకుంటే హెర్బల్ టీ రెడీ అయినట్లే. ప్రతిరోజూ ఒక కప్పు కాకర టీ తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. హైపోగ్లైసీమియా ఉన్నవారు కాకరకాయ టీ తాగే ముందు వైద్యుడిని సంప్రదించడం మర్చిపోకూడదు.




