- Telugu News Photo Gallery Benefits of Radish: Do You Know the Nutritional Health Benefits of White Radish
Benefits of Radish: ముల్లంగితో ఎన్ని లాభాలో.. గాయాలు త్వరగా మానాలంటే రోజూ ఆహారంలో..
దుంపకూరల్లో ముల్లంగి ఒకటి. రుచికి కొంచెం వెగటుగా ఉన్నా వీటిల్లో ఎన్నో పోషకాలు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా పొటాషియం, పీచు, జింక్, భాస్వరం, మెగ్నీషియం, కాపర్, క్యాల్షియం, ఐరన్, మాంగనీస్, ఎ, బి6, సి, ఇ, కె విటమిన్లు అధికంగా ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షించడంలో ముల్లంగి సహాయపడుతుంది. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ముల్లంగిలో ఉండే అధిక నీరు, ఫైబర్ కడుపును ఎక్కువ సమయం..
Updated on: Oct 13, 2023 | 8:18 PM

దుంపకూరల్లో ముల్లంగి ఒకటి. రుచికి కొంచెం వెగటుగా ఉన్నా వీటిల్లో ఎన్నో పోషకాలు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా పొటాషియం, పీచు, జింక్, భాస్వరం, మెగ్నీషియం, కాపర్, క్యాల్షియం, ఐరన్, మాంగనీస్, ఎ, బి6, సి, ఇ, కె విటమిన్లు అధికంగా ఉంటాయి.

దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షించడంలో ముల్లంగి సహాయపడుతుంది. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ముల్లంగిలో ఉండే అధిక నీరు, ఫైబర్ కడుపును ఎక్కువ సమయం నిండుగా ఉంచుతుంది. అందువలన బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

కూర, చారు, పచ్చడి, సలాడ్ ఇలా ముల్లంగితో ఏ వెరైటీ చేసినా అదరహో.. అనిపిస్తుంది. ముల్లంగి తింటే కంటిచూపు మెరుగవడమేకాకుండా ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి. ఇది గుండెకు కవచంలా కాపాడుతుంది.

ముల్లంగిలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. ముల్లంగిలో తక్కువ కేలరీలు ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షించడంలోనూ ఇది సహాయపడుతుంది.

ముల్లంగిలోని యాంటీఆక్సిడెంట్లు ఇన్‌ఫ్లమేషన్, ఒత్తిడితో పోరాడుతాయి. ముల్లంగి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుకోవాలనుకుంటే ముల్లంగిని తప్పనిసరిగా ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి.ముల్లంగి కాలేయ ఆరోగ్యానికి సహాయపడుతుందని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. ముల్లంగి క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. ఆందోళనను తగ్గించే శక్తి దీనికి ఉంటుంది. ముల్లంగి తినడం వల్ల జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. జుట్టు రాలడం తగ్గి జుట్టు బలంగా మారుతుంది.




