AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Papaya: ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలు, పండ్లలో బొప్పాయి ముఖ్యమైనది. ఈ పండు ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతో సహాయపడుతుంది. బొప్పాయి పండు రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. బరువు తగ్గడం నుంచి గుండె ఆరోగ్యానికి మెరుగుపరచడం వరకు దీనివల్ల లెక్కలేనన్ని లాభాలు ఉన్నాయి..

Srilakshmi C
|

Updated on: Jan 23, 2025 | 1:27 PM

Share
బొప్పాయిలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది.

1 / 5
బొప్పాయి రుచికరమైనది మాత్రమే కాదు, పోషకమైనది కూడా. అలాగే సంవత్సరంలో 12 నెలలు లభించే పండ్లలో బొప్పాయి ఒకటి. ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందించే అద్భుత పండు. రోజూ ఉదయాన్నే ఈ పండు ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల అనేక రకాల వ్యాధులు నయమవుతాయట. బొప్పాయి తింటే ఏయే వ్యాధులు నయమవుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

2 / 5
బొప్పాయిలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బొప్పాయి జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. బొప్పాయిలో ఉండే డైజెస్టివ్ ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది ఆమ్లత్వం, గ్యాస్, మలబద్ధకాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది, ఇది మధుమేహం లక్షణాలను కూడా తగ్గిస్తుంది. బొప్పాయిలో పొటాషియం, ఇతర పోషకాలు అధికంటా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

3 / 5
బొప్పాయిలో చాలా యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇది క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. ముఖ్యంగా కొలొరెక్టల్ క్యాన్సర్ నివారణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బొప్పాయిలో మంచి మొత్తంలో విటమిన్ సి, విటమిన్ ఎ ఉన్నాయి. ఇది పేగు ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

4 / 5
బొప్పాయిలో ఉండే ఫైబర్ డైవర్టికులిటిస్ వంటి ప్రేగు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించి, ఆరోగ్యకరమైన ప్రేగులకు మేలు చేస్తుంది. బొప్పాయిలో విటమిన్ కె, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వాటిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఈ పండులో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఉంటుంది. ఇది బరువు నియంత్రణలో సహాయపడుతుంది.

5 / 5