AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Relationship: అబ్బాయిలు, అమ్మాయిలకు అలర్ట్.. పెళ్లికి ముందు ఈ ఐదు ప్రశ్నలు తప్పనిసరిగా అడగాల్సిందే..

Relationship Tips: జీవితంలో వివాహ బంధం అనేది చాలా ముఖ్యమైన విషయం. పెళ్లికి ముందు మనసులో చాలా ప్రశ్నలు మెదులుతుంటాయి. ఇవి మీ వైవాహిక జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే వివాహా బంధం నిర్ణయంలో ఏదైనా తప్పటడుగులు వేస్తే యువకులైనా.. యువతులైనా జీవితాంతం పశ్చాత్తాపపడే అవకాశముంది.

Shaik Madar Saheb
|

Updated on: Jul 19, 2023 | 1:34 PM

Share
Relationship Tips: జీవితంలో వివాహ బంధం అనేది చాలా ముఖ్యమైన విషయం. పెళ్లికి ముందు మనసులో చాలా ప్రశ్నలు మెదులుతుంటాయి. ఇవి మీ వైవాహిక జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే వివాహా బంధం నిర్ణయంలో ఏదైనా తప్పటడుగులు వేస్తే యువకులైనా.. యువతులైనా జీవితాంతం పశ్చాత్తాపపడే అవకాశముంది. మీది ప్రేమ వివాహమైనా లేదా పెద్దల సమక్షంలో కుదిరిన వివాహమైనా.. పెళ్లికి ముందు కొన్ని విషయాలు క్లియర్ చేసుకోవడం మంచిది.

1 / 6
పెళ్లి నిశ్చయానికి ముందు కాబోయే భాగస్వామిని (పురుషులు లేదా మహిళలు) కొన్ని ప్రశ్నలు అడగండి.. వారి సమాధానాల గురించి క్లియర్ గా తెలుసుకోండి. పెళ్లి చేసుకునే ముందు ఎలాంటి ప్రశ్నలు అడగాలో తెలుసుకుందాం.

2 / 6
కెరీర్ గురించి మాట్లాడండి: చాలా మంది తమ కెరీర్‌పై చాలా సీరియస్‌గా ఉంటారు. అలాంటప్పుడు, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకునే ముందు, మీ కాబోయే భాగస్వామితో దాని గురించి మాట్లాడండి. అదే సమయంలో, వారిని వ్యాపార సంబంధిత ప్రశ్నలు అడగండి.. అంతేకాకుండా మీ కెరీర్ లక్ష్యాలను కూడా పంచుకోండి. దీంతో వివాహం తర్వాత జీవిత భాగస్వామి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని చక్కగా నిర్వహించగలుగుతారు

3 / 6
ఆర్థిక స్థితిని పంచుకోండి: వివాహానికి ముందు మీరు మీ ఆర్థిక పరిస్థితిని ఒకరితో ఒకరు పంచుకుంటే అది మీకు మంచిది. వాస్తవానికి పెళ్లయిన తర్వాత చాలా సార్లు డబ్బు కోసం జంటలు గొడవ పడుతుంటారు. అందుకే పెళ్లికి ముందు మీ భాగస్వామితో మీ గురించి, మీ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడటం చాలా ముఖ్యం. తద్వారా మీ వైవాహిక జీవితం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది.

4 / 6
పని - కుటుంబం గురించి కూడా మాట్లాడండి: పెళ్లయిన తర్వాత చాలా సార్లు వర్కింగ్ కపుల్స్ కి పని విషయంలోనూ, ఫ్యామిలీ విషయంలోనూ విభేదాలు వస్తాయి. ఈ సమస్యను నివారించడానికి పెళ్లికి ముందు భాగస్వామితో మాట్లాడటం ద్వారా ప్రతిదీ క్లియర్ చేసుకోవడం అవసరం. తద్వారా వివాహానంతరం పని చేస్తున్నప్పుడు మీకు లేదా మీ కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. మీ వైవాహిక జీవితం ఆనందంగా కొనసాగుతుంది.

5 / 6
కుటుంబ నియంత్రణ గురించి మాట్లాడండి: వివాహానికి ముందు మీ భాగస్వామితో కుటుంబ నియంత్రణ గురించి కూడా మాట్లాడండి. ప్రతిదీ పరస్పరం అంగీకరించిన తర్వాత మాత్రమే సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లడం గురించి ఆలోచించండి. వాస్తవానికి చాలా మంది జంటలు పెళ్లి తర్వాత కుటుంబ నియంత్రణను ఇష్టపడతారు. కొందరు ఇష్టపడరు. అటువంటి పరిస్థితిలో, వివాహం తర్వాత ఇద్దరి ఆలోచనలు నెరవేరకపోతే, మీరు ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది.

6 / 6