- Telugu News Photo Gallery Ayurveda expert on list of vegetables to eat and avoid during monsoon in telugu
Ayurvedic Tips: వర్షాకాలంలో తినాల్సిన, తినకూడని కూరగాయల జాబితా.. ఆయుర్వేదం ఏమి చెబుతోందంటే..
పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం ఏ సీజన్ లో లభించే పండ్లు, కూరగాయలు ఆ సీజన్ లో తినడం వలన ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇదే విషయాన్ని ఆయుర్వేదం లో కూడా పేర్కొన్నారు. తాజా కూరగాయలు, పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అదే సమయంలో వర్షాకాలంలో కొన్ని రకాల కూరగాయలు అనారోగ్యానికి కారణం అవుతాయి.
Updated on: Jul 28, 2023 | 12:38 PM

పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం ఏ సీజన్ లో లభించే పండ్లు, కూరగాయలు ఆ సీజన్ లో తినడం వలన ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇదే విషయాన్ని ఆయుర్వేదం లో కూడా పేర్కొన్నారు. తాజా కూరగాయలు, పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అదే సమయంలో వర్షాకాలంలో కొన్ని రకాల కూరగాయలు అనారోగ్యానికి కారణం అవుతాయి.

ఆయుర్వేదంలో శారీరక భౌతిక స్థితులను వాత, పిత్త , కఫ ఆధారంగా నిర్వచిస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా శారీరక స్థితి కూడా మారుతుంది. అందుకే వర్షాకాలంలో పెరుగుకు దూరంగా ఉండాలని ఆయుర్వేదం సిఫార్సు చేస్తోంది.

అదే సమయంలో ఆయుర్వేదం ప్రకారం వర్షాకాలంలో తినకూడని అనేక కూరగాయలు ఉన్నాయి. ఇవి జలుబు, దగ్గు సమస్యలను కలిగిస్తాయి. విరేచనాలతో పాటు కడుపు నొప్పి కూడా రావచ్చు. కనుక ఆరోగ్యంగా ఉన్నప్పటికీ వర్షాకాలంలో కొన్ని కూరగాయలకు దూరంగా ఉండాలి. అవి ఏమిటో తెలుసుకుందాం..

వర్షాకాలంలో క్యాప్సికమ్ లేదా బెల్ పెప్పర్‌కు దూరంగా ఉండండి. వర్షాకాలంలో దీనితో చేసిన ఆహారాన్ని తినడం వల్ల గ్యాస్-గుండెల్లో మంట, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. అదే విధంగా కొంతమంది టమోటాలకు కూడా దూరంగా ఉండండి.

పాలకూర శీతాకాలపు ఆహారం. మార్కెట్‌లో దొరికే ఈ ఆకు కూరను వర్షాకాలంలో తినకండి. వర్షాకాలంలో దీనిని తినడం వలన వివిధ జీర్ణ సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.

ఆయుర్వేదం ప్రకారం వర్షాకాలంలో క్యాలీఫ్లవర్, క్యాబేజీ తినకపోవడమే మంచిది. ఇవి శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. కడుపు నొప్పి రాకుండా ఉండాలంటే వర్షాకాలంలో ఈ ఆహారాలు తినకపోవడమే ఆరోగ్యానికి మంచిది.

వర్షాకాలంలో పొట్టను చల్లబరచడానికి, జీర్ణ రుగ్మతలను నివారించడానికి తోటకూర తినండి. తోటకూరలో చేసిన ఏ కూర అయినా ఈ సీజన్ లో ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతేకాకుండా ఈ ఆకుకూరలో ఉండే పోషకాలు జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

వర్షాకాలంలో తినే ఆహారంలో గసగసాలను, అల్లాన్ని వేసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బీర కాయలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చర్మ సమస్యలను తగ్గిస్తుంది. వర్షాకాలంలో శరీరంలో శారీరక మంటను తగ్గించడంలో అల్లం సహాయపడుతుంది.





























