- Telugu News Photo Gallery Are you suffering from ear pain? These home remedies work effectively, check here is details
Ear Pain Remedies: చెవి నొప్పి బాగా వస్తుందా.. వెంటనే ఇలా చేయండి..
శరీరంలో అత్యంత సున్నితమైన భాగాల్లో చెవి నొప్పి కూడా ఒకటి. ఇతర సమస్యలు ఏం వచ్చినా తట్టుకోవచ్చు. కానీ చెవి నొప్పి వచ్చిందంటే నరకం చూడాల్సిందే. ముఖ్యంగా చిన్న పిల్లలకు వస్తే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఈ చెవి నొప్పి ఎక్కువగా అర్థరాత్రి సమయాల్లోని ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి నెలకుంటుంది. ఆ సమయంలో ఇంటి చిట్కాలు ఎంతో ఎఫెక్టీవ్‌గా..
Updated on: Jul 29, 2024 | 4:25 PM

శరీరంలో అత్యంత సున్నితమైన భాగాల్లో చెవి నొప్పి కూడా ఒకటి. ఇతర సమస్యలు ఏం వచ్చినా తట్టుకోవచ్చు. కానీ చెవి నొప్పి వచ్చిందంటే నరకం చూడాల్సిందే. ముఖ్యంగా చిన్న పిల్లలకు వస్తే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

ఈ చెవి నొప్పి ఎక్కువగా అర్థరాత్రి సమయాల్లోని ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి నెలకుంటుంది. ఆ సమయంలో ఇంటి చిట్కాలు ఎంతో ఎఫెక్టీవ్‌గా పని చేస్తాయి. ఈ సారి ఈ చిట్కాలు ట్రై చేయండి.

తులసి సర్వ రోగ నివారిణి. అందుకే ప్రతీ ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉండాలని చెబుతూ ఉంటారు. చెవిలో నొప్పి, ఇన్ ఫెక్షన్, గులిమి వంటి సమస్యలో బాధ పడుతూ ఉంటే.. చెవిలో తులసి ఆకుల రసాన్ని రెండు చుక్కలు వేయండి. ఇలా గంటకు ఒకసారి వేస్తూ ఉంటే నొప్పి త్వరగా తగ్గుతుంది.

చెవి నొప్పితో బాధ పడుతూ ఉంటే లవంగం పెయిన్ కిల్లర్‌లా పని చేస్తుంది. చెవి నొప్పితో బాధ పడుతూ ఉంటే.. కొద్దిగా నువ్వుల నూనెలో ఒక లవంగం వేసి డబుల్ బాయిల్ పద్దతిలో మరిగించి.. వడకట్టి.. చెవిలో రెండు లేదా మూడు చుక్కల ఆయిల్ వేయండి. ఇలా చేస్తే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

చాలా మందికి చెవి వాపు సమస్య కూడా ఉంటుంది. ఇలాంటి వాళ్లు వెల్లుల్లితో సమస్యను తగ్గించుకోవచ్చు. రెండు లేదా మూడు రెబ్బల వెల్లుల్లిని దంచి అందులో కొద్దిగా ఉప్పు వేసి నొప్పి ఉన్న ప్రదేశంలో ఉంచండి. ఇలా చేస్తే నొప్పి, వాపు రెండూ తగ్గుతాయి.




