Figs Side Effects: అజీర్ పండ్లు ఎక్కువగా తింటున్నారా? అయితే చాలా ప్రమాదం..!
అంజీర్ పండ్లలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు నిండివున్నాయి. శరీరానికి కావాల్సిన శక్తిని పెంచే అనేక ఔషధ గుణాలు లభిస్తాయి. అంజీర్ ప్రతి రోజూ తినడం వల్ల కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, మాంగనీస్, కాపర్, మెగ్నీషియం వంటి శరీరానికి అనేక ఖనిజాలు లభిస్తాయి. ముఖ్యంగా పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే అంజీర్ పండ్లను అతిగా తినడం వల్ల తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంజీర్ అతిగా తింటే అనారోగ్య సమస్యలు తప్పవని సూచిస్తున్నారు.