- Telugu News Photo Gallery Andhra Pradesh: idol of Bala Ramadu which is to be installed in Ayodhya Ram Mandir was made in Allagadda of Nandyala district
Andhra Pradesh: అయోధ్యలో ప్రతిష్టించనున్న బాల రాముడి విగ్రహం ఎక్కడ తయారు చేశారో తెలుసా?
రామజన్మ భూమి అయోధ్యలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తూన్న రామాలయం సముదాయంలో ప్రతిష్ఠించనున్న బాల రాముని విగ్రహాన్ని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో తయారు చేయించారు. విగ్రహదాత విగ్రహాన్ని ఆళ్ళగడ్డ శిల్పా కళాకారులతో రూపొందించారు. తయారు చేసిన విగ్రహాన్ని హిందూ ఐక్య ఫౌండేషన్ అధ్వర్యంలో ఆళ్లగడ్డ నుంచి నంద్యాల, మహానంది, ప్రకాశం జిల్లా గిద్ద లూరు, మార్కాపురం, విజయవాడ మీదుగా..
Updated on: Oct 22, 2023 | 8:08 PM

ఆళ్లగడ్డ, అక్టోబర్ 22: రామజన్మ భూమి అయోధ్యలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తూన్న రామాలయం సముదాయంలో ప్రతిష్ఠించనున్న బాల రాముని విగ్రహాన్ని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో తయారు చేయించారు.

విగ్రహదాత విగ్రహాన్ని ఆళ్ళగడ్డ శిల్పా కళాకారులతో రూపొందించారు. తయారు చేసిన విగ్రహాన్ని హిందూ ఐక్య ఫౌండేషన్ అధ్వర్యంలో ఆళ్లగడ్డ నుంచి నంద్యాల, మహానంది, ప్రకాశం జిల్లా గిద్ద లూరు, మార్కాపురం, విజయవాడ మీదుగా అయోధ్యకు తరలించనున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.

నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ రామాలయంలో బాలరాముని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం రామ నామస్మరణతో పట్టణంలోని పుర వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు.

నంద్యాల నుంచి మహానంది మీదుగా గిద్దలూరు ,విజయవాడ మీదుగా అయోద్య కు బయలు దేరి వెళ్లింది.నంద్యాల జిల్లా అళ్ళగడ్డ శిల్పా కళకారుల ప్రతిభ దేశ వ్యాప్తంగా హాట్ టాఫిక్ గా మారింది.

కాగా అయోధ్యలోని రామమందిరంలో సంప్రోక్షణ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది జనవరి 21, 22, 23 తేదీల్లో ఆలయ ట్రస్ట్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి మూడో వారంలో రాయాలయంలో జరగనున్న విగ్రహ ప్రతిష్ట వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీతోపాటు సాధువులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.
