- Telugu News Photo Gallery Amazing Health Benefits of Beetroot, Boost Heart, Brain, Gut Health Naturally
వీటిని చిన్న చూపు చూస్తున్నారా..? ఇంతకాలం మిస్సయినట్లే.. పోషకాల పవర్‌హౌస్..
బీట్‌రూట్‌లో ఎన్నో విటమిన్లు, ఖనిజాలు దాగున్నాయి.. దీనిని రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మరింత మెరుగుపర్చుకోవచ్చు.. ఈ దుంప కూరగాయ ఆరోగ్యకరమైన ఆహారమని.. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. బీట్‌రూట్‌లో విటమిన్లు, ఖనిజాలతోపాటు.. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.
Updated on: Jul 27, 2025 | 1:17 PM

బీట్‌రూట్‌లో ఎన్నో విటమిన్లు, ఖనిజాలు దాగున్నాయి.. దీనిని రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మరింత మెరుగుపర్చుకోవచ్చు.. ఈ దుంప కూరగాయ ఆరోగ్యకరమైన ఆహారమని.. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. బీట్‌రూట్‌లో విటమిన్లు, ఖనిజాలతోపాటు.. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా, విటమిన్ ఏ, విటమిన్ సి, ఫోలేట్, మాంగనీస్, పొటాషియం, మెగ్నీషియం.. ఐరన్ వంటి పోషకాలు బీట్‌రూట్‌లో లభిస్తాయి. ఇవి రక్తపోటును తగ్గించడానికి, వ్యాయామ సామర్థ్యాన్ని పెంచడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి.

ఇంకా రక్తహీనతతో బాధపడే, అలాగే.. పలు సమస్యలతో బాధపడే వారు బీట్‌రూట్ తీసుకుంటే.. ఆ సమస్యల నుంచి బయటపడొచ్చు.. వీటితో పాటు, బీట్‌రూట్ మీ ఆరోగ్యానికి అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. బీట్‌రూట్‌ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకోండి..

beetroot juice

చర్మం పొడిబారి, ఎండిపోయి ఉంటే బీట్ రూట్ ఫేస్ ప్యాక్‌తో తిరిగి చర్మ సౌందర్యాన్ని పునరుద్ధరించవచ్చు. ముందుగా బీట్‌రూట్ తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి, మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ మాదిరి చేసుకోవాలి. ఈ మిశ్రమంలో పాలు కలిపి చిక్కని పేస్ట్ లా తీయారు చేసుకోవాలి.

పీరియడ్స్ సమయంలో నొప్పిని తగ్గిస్తుంది. బీట్‌రూట్‌లోని శోథ నిరోధక లక్షణాలు ఈ సమయంలో సంభవించే కడుపు నొప్పి, వాపును తగ్గిస్తాయి. బీట్‌రూట్‌లో నైట్రేట్లు కూడా ఉంటాయి. ఇవి శరీరంలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. అలసట నుంచి ఉపశమనం కలిగిస్తాయి. శక్తిని పెంచుతాయి.




