- Telugu News Photo Gallery Abusive behaviour which seems normal but do not ignore these in Relationships
Relationship: బంధం జర భద్రం.. భార్యాభర్తలూ ఇలాంటి విషయాలను అస్సలు విస్మరించకండి..
రిలేషన్‌షిప్.. ప్రేమ, నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. అయితే, సంబంధంలో చిన్నచిన్న గొడవలు, మనస్పర్థలు సహజం.. కాని కొన్ని విషయాలను మాత్రం అస్సలు సహించకూడదు.. కొట్టడం.. మాటలతో దుర్భాషలాడటం లాంటివాటిని చాలామంది లైట్ తీసుకుంటారు.. కానీ.. అది కేవలం భౌతికమైనది దాడి కాదు. మానసికమైనది కూడా..
Updated on: Jan 08, 2024 | 9:05 PM

రిలేషన్‌షిప్.. ప్రేమ, నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. అయితే, సంబంధంలో చిన్నచిన్న గొడవలు, మనస్పర్థలు సహజం.. కాని కొన్ని విషయాలను మాత్రం అస్సలు సహించకూడదు.. కొట్టడం.. మాటలతో దుర్భాషలాడటం లాంటివాటిని చాలామంది లైట్ తీసుకుంటారు.. కానీ.. అది కేవలం భౌతికమైనది దాడి కాదు. మానసికమైనది కూడా.. దుర్వినియోగం అంటే ఒక వ్యక్తిని బాధపెట్టడం, బాధించడం, అవమానించడం, దారుణంగా వ్యవహరించడం.. సంబంధం క్షీణించడం ప్రారంభించినప్పుడు కొంతమందికి ఇది జరుగుతుంది. అయితే, ఇలాంటి విషయాలను అస్సలు విస్మరించకూడదు.. నిజానికి ఇవి మానసిక వేధింపులు.. బంధంలో ఎలాంటివి విస్మరించకూడదో.. ఇప్పుడు తెలుసుకోండి..

ఎగతాళి చేయడం: భార్యాభర్తలు తమ భాగస్వామిని ఎదుటివారి ముందు ఎగతాళి చేయడం మామూలు విషయం కాదు. ఇతరుల ముందు సరదాగా మాట్లాడటం కంటే స్నేహితులతో సరదాగా మాట్లాడటం వేరు.

ప్రతిదానిపై నియంత్రణ: ఒక సంబంధంలో మీ భాగస్వామి మీరు చేసే పని.. మీరు ఎక్కడికి వెళతారు? ఎవరితో మాట్లాడతారు.. మీ వ్యక్తిగత జీవితం గురించి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా మీకు అనుమతి లేకపోతే.. అది ప్రేమ కాదు దుర్వినియోగం అని అర్ధం చేసుకోవాలి..

తనిఖీ: మీ భాగస్వామి మీ మొబైల్‌ని నిరంతరం తనిఖీ చేస్తుంటే.. మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో మీరు ఏమి మాట్లాడుతున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే.. ఇది ఆమోదయోగ్యం కాదు.

చిన్నచూపు చూడటం.. నిందించడం: మీ భాగస్వామి తన స్నేహితులు లేదా ఇతర వ్యక్తుల ముందు మిమ్మల్ని తెలివితక్కువవారిగా చూపించడానికి ప్రయత్నిస్తే, అది దుర్వినియోగం. ఇంకా ప్రతిదానికీ నిందించడం, విషయాలకే తగాదాలు పడుతూ మీపై నిందలు వేస్తుంటే.. మిమ్మల్ని మానసికంగా వేధిస్తున్నట్లు అర్ధం చేసుకోవచ్చు.

హేళన: మీ భాగస్వామి తరచూ మిమ్మల్ని దూషించినా.. అనుమానంతో ఇబ్బందులకు గురిచేసినా.. సంబంధంలో అది మానసిక వేధింపులుగా పరిగణించవచ్చు..





























