- Telugu News Photo Gallery A dirty tea filter can be turned white with these tips, Check Here is Details
Kitchen Hacks: నల్లగా మారిన టీ చిక్కాన్ని ఇలా క్లీన్ చేస్తే తెల్లగా మెరిసిపోతుంది..
ఇంట్లో ఉండే వాటితో ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించుకోవచ్చు. కిచెన్‌లో తరచూ ఉపయోగించే వాటిల్లో టీ ఫిల్టర్ కూడా ఒకటి. రోజూ ఉపయోగించడం వల్ల నల్లగా మారుతుంది. కానీ ఈ చిట్కాలతో నల్లగా మారిన టీ చిక్కాన్ని.. తెల్లగా మార్చుకోవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటో చూసేయండి..
Updated on: Jan 28, 2025 | 2:29 PM

మనం నిత్యం ప్రతి రోజూ ఉపయోగించే వాటిల్లో టీ చిక్కం కూడా ఒకటి. దీన్నే టీ జాలీ అని కూడా పిలుస్తారు. ఉదయం లేవగానే టీ తాగపోతే.. ఏ పనీ మొదలు కాదు. రోజూ ఉపయోగించడం వల్ల టీ జాలి నల్లగా మారిపోతుంది. దీంతో పాతవి పడేసి కొత్తవి కొంటూ ఉంటారు. అలా కాకుండా ఇలా క్లీన్ చేస్తే.. మళ్లీ కొత్తదానిలా మెరిసిపోతుంది.

టీ చిక్కాన్ని రోజూ క్లీన్ చేసే విధంగా కాకుండా.. ఈ సారి ఇలా క్టీన్ చేయండి. వేడి నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా వెనిగర్ వేయండి. ఇందులో కాసేపు టీ జాలిని ఉంచి.. ఆ తర్వాత స్క్రబ్బర్‌తో రుద్దితే ఈజీగా మురికి పోతుంది.

నిమ్మ చెక్కతో కూడా టీ చిక్కాన్ని కొత్తగా మెరిపించవచ్చు. వేడి నీటిలో టీ జాలిని నానబెట్టాలి. నిమ్మకాయ రసం పిండాక తొక్కలు పడేయకుండా వాటితో టీ చిక్కాన్ని రుద్దండి. అంతే తెల్లగా మెరుస్తుంది టీ జాలి.

బేకింగ్ సోడాతో ఎలాంటి మురికిని, నలుపును అయినా పోగొట్టవచ్చు. వేడి నీటిలో కొద్దిగా డిటర్జెంట్, బేకింగ్ సోడా వేసి మిక్స్ చేసి అందులో టీ చిక్కాన్ని వేసి నానబెట్టండి. దీన్ని స్క్రబ్బర్‌తో రుద్దితే మురికి అంతా పోతుంది.

ఈ చిట్కా కూడా చక్కగా పని చేస్తుంది. ఒక గిన్నెలో వేడి నీళ్లు తీసుకుని అందులో టీ జాలిని నానబెట్టండి. కాసేపటి తర్వాత తీసి.. డిష్ వాష్ సోప్ ఉపయోగించి స్క్రబ్బర్‌తో రుద్దితే మురికి పోతుంది.




