AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీకు ఇవి కనిపిస్తున్నాయా..? అయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువుదీరినట్టే..!

మన భారతీయ సంప్రదాయంలో శ్రీ మహాలక్ష్మిని డబ్బు ఐశ్వర్యానికి అధిష్టాన దేవతగా చూస్తాం. జ్యోతిష్య, వాస్తు శాస్త్రాల ప్రకారం.. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవాళ్లకు ఆర్థిక సమస్యలు రావు. ఆమె కటాక్షానికి కొన్ని సంకేతాలు ఉంటాయట. అవి కనిపిస్తే మనం డబ్బు సంపాదించే దారిలో ఉన్నామని అనుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం.. కొన్నిసార్లు ఆర్థికంగా ఎదగబోతున్న వారికి కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు కనిపిస్తాయట. ఇవి దేవుడి దయకు గుర్తు. అలాంటి సూచనలు జీవితంలో వస్తే.. మనం మంచి పనులపై దృష్టి పెట్టి వాటిని మరింత బలంగా మార్చుకోవాలి.

Prashanthi V
|

Updated on: Jul 25, 2025 | 8:33 PM

Share
డబ్బు బాగా రావాలని కోరుకునే వాళ్లు ప్రతిరోజూ స్నానం చేశాక.. శుద్ధమైన మనసుతో శ్రీ మహాలక్ష్మిని పూజించాలి. పూలతో, దీపంతో, నైవేద్యంతో ఆమెను ప్రసన్నం చేసుకోవడం వల్ల.. శాంతి, ఐశ్వర్యం, మంచి జరుగుతాయని వేదాలు చెబుతున్నాయి. ఆ అమ్మవారు అనుగ్రహిస్తే జీవితంలో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి.

1 / 5
శ్రీ మహాలక్ష్మికి వాహనంగా భావించే గుడ్లగూబ అనుకోకుండా ఇంటి దగ్గర కనిపిస్తే.. అది డబ్బు లాభానికి సంకేతంగా చూడొచ్చు. ఇది అజ్ఞానాన్ని పోగొట్టి సంపదను ఆకర్షించే మంచి సైన్ గా భావిస్తారు.

2 / 5
ఉదయం లేదా సాయంత్రం శంఖం శబ్దం వినిపిస్తే.. అది ఆర్థికంగా ఎదుగుదల జరగబోతుందని సూచించవచ్చు. శంఖం సముద్ర మథనం సమయంలో వచ్చిన పవిత్ర వస్తువు. అందుకే ఇది శ్రీ మహాలక్ష్మికి చాలా ఇష్టమైనదిగా, పూజల్లో ముఖ్యమైనదిగా ఉంటుంది.

3 / 5
భారతీయ సంప్రదాయాల్లో పిచ్చుకను శుభానికి, మంచికి, తెలివితేటలకు గుర్తుగా చూస్తారు. ఏ ఇంట్లోనైనా పిచ్చుక వచ్చి కూర్చుంటే.. అది ఆ ఇంటి వాళ్లపై లక్ష్మీదేవి దయ కురుస్తుందని నమ్ముతారు.

4 / 5
కలల్లో కమలం పువ్వు కనిపిస్తే.. అది డబ్బు, శాంతి, విజయం రాబోతున్నాయని చెబుతుంది. కమలం మహాలక్ష్మికి చాలా ఇష్టమైన పువ్వు. అందుకే ఈ పువ్వు కలలో కనిపిస్తే మంచి సంకేతంగా భావిస్తారు.

5 / 5
Follow Us