Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ‘ప్లీజ్ డాడీ.. వాటిని తీసుకెళ్లకండి’.. కోళ్ల కోసం చేతులు జోడించి, బోరున విలపిస్తున్న బాలుడు.. వీడియో వైరల్..

Viral Video: చిన్న పిల్లలు పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టపడుతారు. కుక్కలు, పిల్లులు, పక్షులు అంటే వారికి చాలా ఇష్టం. వాటిలో సరదాగా..

Viral Video: ‘ప్లీజ్ డాడీ.. వాటిని తీసుకెళ్లకండి’.. కోళ్ల కోసం చేతులు జోడించి, బోరున విలపిస్తున్న బాలుడు.. వీడియో వైరల్..
Boy Video Viral
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 30, 2021 | 6:31 PM

Viral Video: చిన్న పిల్లలు పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టపడుతారు. కుక్కలు, పిల్లులు, పక్షులు అంటే వారికి చాలా ఇష్టం. వాటిలో సరదాగా ఆడుకుంటారు. వారికి అవే లోకం. చాలా ప్రేమగా వాటిని చూసుకుంటారు. వారి అమాయకత్వంతో కూడిన ప్రేమను చూస్తే ఎవరైనా ఫిదా అయిపోతారు. తాజాగా సిక్కిం రాష్ట్రానికి చెందిన ఓ బాలుడి వీడియో సోషల్ మీడియాలో తెగ చర్కర్లు కొడుతోంది. కొళ్ల ఫామ్ నుంచి తన కోళ్లను తీసుకెళ్తుంటే.. ఆ బాలుడు పడిన బాధ అంతా ఇంతా కాదు. ఆ చిన్నారిని చూస్తే పాపం అనిపించక మానదు.

ఇంతకూ ఆ వీడియోలో ఏముందంటే.. బాలుడి కుటుంబానికి కోళ్ల ఫామ్ ఉంది. అయితే, ఆ కోళ్ల ఫామ్‌లో నిత్యం పర్యటించే బాలుడు.. కోళ్లతో సరదాగా ఆడుకునేవాడు. అలా వాటిని ఫ్రెండ్స్‌లా భావించాడు. వాటిపై ప్రేమ పెంచుకున్నాడు. అయితే, కోళ్ల ఫామ్ నుంచి కోళ్లను చికెన్ సెంటర్లకు తరలించడం సాధారణమే. ఇందులో భాగంగా బాలుడి తండ్రి కోళ్లను ఒక చిన్న వ్యాన్‌లో తరలించే ఏర్పాటు చేశాడు. కోళ్ల తరలింపును చూసిన బాలుడు.. ఏడుపు లంకించాడు. కోళ్లను తీసుకెళ్లొద్దని తన తండ్రిని ఆ బాలుడు వేడుకున్నాడు. ‘ప్లీజ్ డాడీ.. వాటిని తీసుకెళ్లకండి’ అంటూ ఏడుస్తూ విజ్ఞప్తి చేశాడు. ఈ కోళ్లను వ్యాన్‌లో వేస్తున్న వారిని కూడా వేడుకున్నాడు. రోడ్డుపై దీనంగా కూర్చుని ఏడుస్తూ కోళ్లను తీసుకెళ్లకండి అంటూ ప్రాధేయపడ్డాడు. ఈ వీడియోను ‘ది వాయిస్ ఆఫ్‌ సిక్కిం’ ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేయగా.. ఇప్పుడది తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటి వరకు 2.5 లక్షల వ్యూస్ వచ్చాయి. వెయ్యికి పైగా కామెంట్స్ వచ్చాయి.

ఆ బాలుడు బాధను చూసి నెటిజన్లు.. పాపం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘అతని బాధ వర్ణణాతీతం’ అని కొందరు.. ‘మూగ జీవాల పట్ల ఆ బాలుడి ప్రేమ స్వచ్ఛమైనది’ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Viral Video:

Also read:

కంటికి కనిపిస్తూనే ఇట్టే ‘మాయమయ్యే’ సైనికులుంటారు జాగ్రత్త ! ఇజ్రాయెల్ లో కొత్త ప్రయోగం

Amul Milk: సామాన్యులకు షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పాల ధరలు.. జూలై 1 నుంచి వర్తింపు!

హై అలర్ట్..! జమ్మూ సిటీలో జామర్లు, డ్రోన్ నిరోధక వ్యవస్థలు ..రాజౌరీ జిల్లాలో ఎగిరే వస్తువుల బ్యాన్

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!