Emetophobia: ఆరేళ్లుగా ఇంటికే పరిమితం అయిన మహిళ.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..!
Emetophobia: కొందరికి ఒక రకమైన భయం ఉంటుంది. దాన్నే వైద్య పరిభాషలో ఫోబియా అంటారు. ఆ ఫోబియాల్లో విచిత్రమైనవి మనం ఎన్నో వింటుంటాం..
Emetophobia: కొందరికి ఒక రకమైన భయం ఉంటుంది. దాన్నే వైద్య పరిభాషలో ఫోబియా అంటారు. ఆ ఫోబియాల్లో విచిత్రమైనవి మనం ఎన్నో వింటుంటాం.. చూసుంటాం. అలాంటి ఫోబియానే ఓ మహిళను ఏకంగా ఆరేళ్ల నుంచి ఇంటి నుంచి బయటకు రాకుండా చేసింది. అవును.. ఎమెటోఫోబియా అనేది ఒకరకమైన భయం. ఈ ఫోబియా కలిగిన వారు వాంతులను చూస్తే విపరీతంగా భయపడిపోతారు. ఇతరులు వాంతులు చేసుకున్నప్పుడు చూడటం.. లేదా ఆతను/ఆమె వాంతులు చేసుకున్నా.. విపరీతమైన భయం, ఆందోళనకు గురై అనార్యోగంగా ఫీలవుతుంటారు. ఈ భయం కొంతమందికి చాలా తీవ్రంగా ఉంటుంది. ఇది వారి జీవన శైలిని పూర్తిగా మార్చేస్తుంది.
యూకే లోని రావెన్‌హిల్ ప్రాంతానికి చెందిన ఎమ్మా డేవిస్(35) అనే మహిళ దాదాపు దశాబ్దాం పాటుగా ఎమెటోఫోబియాతో పోరాడుతోంది. వాంతి భయం కారణంగా ఆమె ఏకంగా ఆరు సంవత్సరాలుగా ఇంటికే పరిమితం అయ్యింది. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే హడలిపోయింది. అయితే తాను ఎదుర్కొంటున్న సమస్య గురించి చెబుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది ఎమ్మా.. ‘చాలా మంది ప్రజలు అనారోగ్యానికి గురవుతుంటారు. కానీ, నాకున్న ఫోబియా నా జీవన శైలినే అతలాకుతలం చేసింది. ఈ దారుణ పరిస్థితి నా జీవితాన్ని అస్తవ్యస్థం చేసింది. నేను నా గదిని విడిచిపెట్టి బయటకు రాలేకపోతున్నాను. ఇది అనారోగ్యంతో బాధపడటం కంటే కూడా చాలా దారుణంగా ఉంది. ఈ ఫోబియా ప్రతి నిమిషం నన్ను ప్రభావితం చేస్తుంది.’ అని తాను ఎదుర్కొంటున్న సమస్య గురించి చెప్పుకొచ్చారు.
ఎమ్మాకు చిన్నప్పటి నుంచే ఈ ఫోబియా ఉన్నప్పటికీ.. గత 12 సంవత్సరాల క్రితం నుంచి అదికాస్తా తారాస్థాయికి చేరింది. చిన్నప్పటి నుంచి వాంతిని చూస్తే భయపడిపోయేది. ఆ భయం తనతోపాటే పెరిగి పెద్దగా మారి.. ఇప్పుడు ఏకంగా ఇంటి నుంచి బయటకు రాకుండా చేసింది. ఈ ఫోబియా కారణంగా ఎమ్మా తాను పని చేసే ప్రాంతంలో తీవ్ర భయాందోళనకు గురయ్యేదట. ఆ కారణంగా పని కూడా చేయలేకపోయానని చెప్పుకొచ్చింది ఎమ్మా. ఈ ఫోబియా నుంచి ఎమ్మా బయటపడేందుకు అనేక రకాల చికిత్సలు తీసుకుంటోంది. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోతోందని వాపోయింది. అయితే, రోజూ వారి పనులు చేసుకోవడం ద్వారా ఎమ్మా ఈ ఫోబియా నుంచి బయటపడే అవకాశం ఉందని పలువురు మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also read: