Viral Video: నీటిలో మునిగిపోతున్న జింక పిల్ల ప్రాణాన్ని కాపాడి.. ప్రజల హృదయాన్ని గెలుచుకున్న సైనికుడు.. వీడియో వైరల్..

Viral Video: సైనికుల ధైర్య, సాహసాల గురించి ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదు. ఏ దేశ సైనికులు అయినా రక్షణే వారి బాధ్యత....

Viral Video: నీటిలో మునిగిపోతున్న జింక పిల్ల ప్రాణాన్ని కాపాడి.. ప్రజల హృదయాన్ని గెలుచుకున్న సైనికుడు.. వీడియో వైరల్..
Baby Fawn
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 14, 2021 | 11:45 PM

Viral Video: సైనికుల ధైర్య, సాహసాల గురించి ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదు. ఏ దేశ సైనికులు అయినా రక్షణే వారి బాధ్యత. తన కర్తవ్య నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్క చేయరు. ఈ క్రమంలోనే ఒక్కొక్కసారి మానవత్వాన్ని కూడా చాటుకుంటారు సైనికులు. తాజాగా ఓ సైనికుడు చేసిన పనికి సర్వత్రా ప్రశంసలు వస్తు్న్నాయి. తన శ్రమ, కృషితో ఓ నిండు ప్రాణాన్ని కాపాడి ప్రజల హృదయాన్ని గెలుచుకున్నాడు. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోంది.

ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈ వీడియోలో ఓ జింక పిల్ల నీటిలో పడిపోయి ఉంది. అది గమనించిన ఓ సైనికుడు జింక పిల్ల పడిపోయిన స్థానంలో ఉన్న చెట్టు మొద్దు ఆధారంగా చేసుకుని ఆ జింక పిల్లను సురక్షితంగా కాపాడుతాడు. నీటిలో మునుగుతున్న జింకను బయటకు తీసుకువస్తాడు. దీనిని అక్కడే ఉన్న సహచర సైనికులు వీడియో తీశారు. కాగా, ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోకు ‘నేను మెరైన్ సోల్జర్’ అని క్యాప్షన్ కూడా పెట్టారు. కాగా, సైనికులు షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.

కాగా, జింక పిల్లను కాపాడిన సైనికుడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సైనికులు.. మనుషులను రక్షణగా ఉన్నట్లుగానే.. మూగ జీవాలకూ ఉంటున్నారని కితాబిచ్చాడు ఓ నెటిజన్. అయితే, నాణేనికి బొమ్మ బొరుసు ఉన్నట్లుగానే.. కొందరు ఆ వీడియోపై నెగెటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఆ జింక పిల్లను వండుకుని తినేసి ఉంటారంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఇదిలాఉంటే.. జూన్ 11వ తేదీన ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఇప్పటి వరకు 60 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.

Viral Video:

Also read:

Gudivada Amarnath Reddy : భూకబ్జాలన్నీ చంద్రబాబు కన్నుసన్నల్లోనే.. ఆయన ఫాదర్‌ ఆఫ్‌ కరప్షన్‌ : గుడివాడ

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?