Viral Video: గేటు ముందు పార్కింగ్ చేసిన కారు.. ఆగ్రహించిన రైతు.. ఊహించని రీతిలో షాక్ ఇచ్చాడు.. ఏకంగా..

Viral Video: చిన్న చిన్న విషయాలకే ప్రజలు తీవ్రమైన ఆగ్రహానికి గురవుతుంటారు. ఆ ఆగ్రహంలో విచక్షణ కోల్పోయి వస్తువలను ధ్వంసం చేయడమో.....

Viral Video: గేటు ముందు పార్కింగ్ చేసిన కారు.. ఆగ్రహించిన రైతు.. ఊహించని రీతిలో షాక్ ఇచ్చాడు.. ఏకంగా..
Car
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 14, 2021 | 10:33 PM

Viral Video: చిన్న చిన్న విషయాలకే ప్రజలు తీవ్రమైన ఆగ్రహానికి గురవుతుంటారు. ఆ ఆగ్రహంలో విచక్షణ కోల్పోయి వస్తువలను ధ్వంసం చేయడమో.. మనుషులపై దాడికి పాల్పడటమో చేస్తుంటారు. కానీ, ఇక్కడ ఓ రైతు ఆగ్రహంతో రగిలిపోయి ఏకంగా ఓ కారునే ధ్వంసం చేశాడు. తన క్రాక్టర్‌తో పల్టీలు కొట్టిస్తూ రోడ్డు అవతలికి లాగి పడేశాడు. కారు యజమాని అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండాపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

నార్త్ ఈస్ట్ ఇంగ్లాండ్ లోని డర్హామ్ ప్రాంతంలో బర్నార్డ్ కాజిల్ సమీపంలో కొన్ని కార్డు నిలిపి ఉంచారు. ఓ కారు గేటుకు అడ్డంగా ఉంది. అది చూసిన రైతు ఆగ్రహంతో ఊగిపోయాడు. తన ట్రాక్టర్‌తో వచ్చి కారును ఢీకొన్నాడు. అక్కడే ఉన్న కారు యజమాని ఆ ట్రాక్టర్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ ఆగకుండా కారును పల్టీలు కొట్టిస్తూ రోడ్డు బయటకు ఈడ్చి పడేశాడు. ఆ సమయంలో కారు ఓనర్ దానిని నిలువరించేందుకు చాలా ప్రయత్నించాడు. కొంచెం అయితే ఆ ట్రాక్టర్ కిందే పడేవాడు. అదృష్టావశాత్తు బయటపడ్డాడు. చివరికి కారును రోడ్డు అవతలికి నెట్టివేసి ఆ రైతు తన ట్రాక్టర్‌తో యధావిధిగా వ్యవసాయక్షేత్రంలోకి వెళ్లిపోయాడు. అయితే ఈ ఘటనను అంతా అక్కడే ఉన్న కొందరు వీడియో రికార్డ్ చేశారు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా.. వైరల్‌గా మారింది.

కాగా, ఈ ఘటనపై కారు యజమాని పోలీసులకు కంప్లయింట్ ఇవ్వడంతో వారు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ ఘటన జూన్ 5 సాయంత్రం 5.45 గంటల సమయంలో జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ వీడియో వైరల్ అవగా.. నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు రైతుని నిందిస్తే.. మరికొందరు కారు యజమానిని నిందిస్తున్నారు.

Virla Video:

Also read:

యంగ్ హీరో నిఖిల్ ఖాతాలో మరో మూడు సినిమాలు.?బిజీ బిజీ గా యంగ్ హీరో :Nikhil Siddharth Video.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే