Spaghetti: ఈ వంటకం తినలేం.. ప్లేట్‌లో వేసినా కంటికి కూడా కనిపించదు! కానీ డాక్టర్ మాదిరి ప్రాణం పోస్తుంది

పాస్తా మాదిరి కనిపిస్తున్న ఈ వంటకం చూస్తుంటే నోరూరుతుంది కదూ.. కానీ దీనిని ప్లేట్లో వేస్తే మన కళ్లకు కనిపించదు. సరే స్పూన్తో తీసుకుని తిందామన్నా సాధ్యం కాదు. కానీ వందమంది డాక్టర్లు చేయలేని పని ఇదొక్కటి చేయకలదు. ఇదేదో పొడుపుకథ అనుకునేరు.. కానేకాదు..

Spaghetti: ఈ వంటకం తినలేం.. ప్లేట్‌లో వేసినా కంటికి కూడా కనిపించదు! కానీ డాక్టర్ మాదిరి ప్రాణం పోస్తుంది
Nano Spaghetti
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 22, 2024 | 8:15 PM

స్పఘెట్టి.. ఈ పేరు చాలా మందికి తెలియదు. నిజానికి ఇదొక ఇటాలియన్‌ వంటకం. నూడిల్స్‌ మాదిరి పొడవాటి పాస్తా వంటకం ఇది. ఫోర్క్‌ స్పూన్లతో దీనిని తింటారు. అయితే తాజాగా కొందరు సైంటిస్టులు నానో స్పఘెట్టిని తయారు చేశారు. అయితే ఇది తినడానికి చేసిన నూడిల్స్‌ వంటకం కాదు. అసలు ఇది కంటికి కూడా కనిపించదు. చాలా సూక్ష్మంగా ఉంటుంది. దీనిని చూడాలంటే స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌ను వినియోగించాల్సిందే.

అత్యంత సన్నగా ఉన్న ఈ స్పఘెట్టిని లండన్‌లోని సైంటిస్టులు తయారు చేశారు. కానీ ఇది ఆహారం కాదు. ఇది నానో ఫైబర్. మనిషి కన్ను చూడలేనంత సూక్ష్మమైన ఈ నానో స్పఘెట్టి కేవలం 372 నానోమీటర్‌ల పొడవు ఉంటుంది. ఇది మనిషి తల వెంట్రుక జుట్టు కంటే దాదాపు 200 రెట్లు సన్నగా ఉంటుంది. దీని సాయంతో గాయాలు నయం చేయడానికి, ఎముకల పునరుత్పత్తితో సహా ఆరోగ్య సంరక్షణలో పురోగతికి ఉపయోగపడుతుందని సైంటిస్టులు అంటున్నారు.

ఈ స్పఘెట్టి అనేది.. నానోఫైబర్స్ అని పిలువబడే మెటీరియల్స్ కుటుంబానికి చెందినది. ఇది ఔషధంగా, పరిశ్రమ రెండింటిలోనూ ఉపయోగించే చాలా సన్నని దారాలు మాదిరి ఉంటంఉది. ఈ ఫైబర్స్‌కి శ్వాసక్రియ కూడా ఉంటుంది. బ్యాక్టీరియాను నిరోధించేటప్పుడు గాలి, తేమను అనుమతిస్తాయి. వేగవంతమైన వైద్యం కోసం వీటిని బ్యాండేజీలుగా, కణజాల పెరుగుదలకు పరంజాగా, శరీరంలోని నిర్దిష్ట భాగాలకు మందులను తీసుకువెళ్లడానికి చిన్న డెలివరీ సిస్టమ్‌లుగా వీటిని ఉపయోగించవచ్చు. ఇది అక్షరాలా చాలా చిన్నగా ఉండే స్పఘెట్టి అని సైంటిస్టులోని ఒకరైన డాక్టర్ ఆడమ్ క్లాన్సీ అంటున్నారు. ఈ సున్నితమైన ఫైబర్‌లను రూపొందించడానికి పరిశోధకులు ఎలక్ట్రోస్పిన్నింగ్ అనే సాంకేతికతను ఉపయోగించారు. అంటే పాస్తాను తయారు చేసినట్లుగా కాదు. కానీ పిండి-ఆధారిత మిశ్రమం నుంచి దారాలను లాగడానికి డౌ ప్రెస్‌కు బదులుగా వారు విద్యుత్ చార్జ్‌ని ఉపయోగించారు. ఇది ఎలా పని చేస్తుందో ఇక్కడ తెలుసుకుందా..

ఇవి కూడా చదవండి

తెల్ల పిండి, ఫార్మిక్ యాసిడ్ మిశ్రమంతో దీన్ని తయారు చేశారు. యాసిడ్ పిండిలోని పిండి పదార్ధాలను విచ్ఛిన్నం చేస్తుంది. ఇది నానోఫైబర్‌లుగా మారడాన్ని సులభతరం చేస్తుంది. ఎలక్ట్రికల్ ఛార్జ్ మిశ్రమాన్ని అతి-సన్నని తంతువులుగా విస్తరించి, వాటిని మెటల్ ప్లేట్‌లో జమ చేస్తుంది. ఈ ప్రక్రియలో యాసిడ్ ఆవిరైపోయింది. ఇలా ప్రపంచంలోని అతి చిన్న స్పఘెట్టి తంతువులను (దారాలను) తయారు చేస్తారు. దీనికి పిండినే ఎందుకు తీసుకున్నారంటే.. స్టార్చ్ బయోడిగ్రేడబుల్. అందువల్లనే వైద్య అవసరాలకు దీనిని వినియోగించారు. సాంప్రదాయ పద్ధతుల ద్వారా స్వచ్ఛమైన పిండిని తీసి, స్పఘెట్టిలను తయారు చేస్తారు.

నానో-స్పఘెట్టిని ఎందుక వాడుతారు?

  • నానో-స్పఘెట్టి అనే ఈ నానోఫైబర్‌లను వైద్యానికి ఉపయోగించవచ్చు. అంటే రోగికి వైద్యం వేగవంతం చేసేంఉదకు గాయాలను శుభ్రంగా ఉంచే కట్టుగా ఉపయోగపడుతుంది.
  • కొత్త కణజాలం లేదా ఎముకలు కూడా పెరగడానికి పరంజాలా ఉపయోగపడుతుంది.
  • శరీరంలోని నిర్దిష్ట భాగాలను ఖచ్చితత్వంతో లక్ష్యంగా చేసుకునే డ్రగ్ డెలివరీ సిస్టమ్‌లుగా వినియోగించుకోవచ్చు.
  • నానోఫైబర్‌లు అదనపు-సెల్యులార్ మాతృకను అనుకరిస్తాయి. కణాలకు చికిత్స చేయడంలో ఉపయోగించే ఒక రకమైన పరంజా.
  • కణజాలాన్ని తిరిగి పెంచడానికి వాటిని పరిపూర్ణంగా చేస్తాయని ఈ అధ్యయనంలో పాల్గొన్న ప్రొఫెసర్ గారెత్ విలియమ్స్ వివరించారు.

దీన్ని తినొచ్చా?

పాస్తా ప్రియులు దీన్ని తినేయొచ్చని అనుకుంటున్నారేమో. ఇది డిన్నర్ కోసం కాదు. వైద్యం కోసం ఉపయోగపడుతుందరి ప్రొఫెసర్ విలియమ్స్ చమత్కరించారు. పాస్తా మాదిరే దీన్ని కూడా ఉడికిస్తారు. కానీ ఇది ఒక సెకనులోపే ఉడుకుతుంది. కాబట్టి, ఈ స్పఘెట్టి తినలేకపోయినప్పటికీ వైద్యంలో దాని సంభావ్యత అద్భుతంగా ఉంటుంది. ఈ నానోఫైబర్‌లు సజీవ కణాలతో ఎలా సంకర్షణ చెందుతాయో, అవి ఎంత త్వరగా విచ్ఛిన్నమవుతాయో పరీక్షించాలని పరిశోధకులు ప్లాన్ చేస్తున్నారు. వాస్తవ-ప్రపంచ అనువర్తనాల కోసం ఉత్పత్తిని పెంచవచ్చో లేదో కూడా వారు అన్వేషించాలనుకుంటున్నారు. వీరు చేసే ప్రయోగం సఫలం అయితే ఈ నానో-స్పఘెట్టి ఆకలిని తీర్చలేకపోవచ్చు కానీ త్వరలో ప్రాణాలను రక్షించడంలో సహాయపడుతుందని సైంటిస్టులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్‌ చేయండి.

స్కంద షష్ఠి రోజున ఇలా కార్తికేయుడిని పూజించండి కోరిక నెరవేరుతుంది
స్కంద షష్ఠి రోజున ఇలా కార్తికేయుడిని పూజించండి కోరిక నెరవేరుతుంది
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
2025లో మొదటి వైకుంఠ ఏకాదశి తేదీ, పూజ సమయం, ప్రాముఖ్యత ఏమిటంటే
2025లో మొదటి వైకుంఠ ఏకాదశి తేదీ, పూజ సమయం, ప్రాముఖ్యత ఏమిటంటే
అందరూ వేరు.. నేను వేరు.. ఫూల్లుగా తాగి ఏం చేశాడంటే..
అందరూ వేరు.. నేను వేరు.. ఫూల్లుగా తాగి ఏం చేశాడంటే..
JEE పరీక్షపై జోసా కీలక నిర్ణయం..కౌన్సెలింగ్ షెడ్యూల్ మరింత ఆలస్యం
JEE పరీక్షపై జోసా కీలక నిర్ణయం..కౌన్సెలింగ్ షెడ్యూల్ మరింత ఆలస్యం
పాముకు పాలు పోస్తే ఇంతే మరి పాక్ పై విరుచుకుపడుతోన్న తాలిబన్లు
పాముకు పాలు పోస్తే ఇంతే మరి పాక్ పై విరుచుకుపడుతోన్న తాలిబన్లు
ఇంతమంది తాగుబోతులు దొరికారా.? ఎన్ని కేసులు నమోదయ్యాయంటే
ఇంతమంది తాగుబోతులు దొరికారా.? ఎన్ని కేసులు నమోదయ్యాయంటే
కొత్త ఏడాదిలో రాహు, కేతుల రాశి మార్పు.. ఈ 3 రాశులకు అన్నీ కష్టాలే
కొత్త ఏడాదిలో రాహు, కేతుల రాశి మార్పు.. ఈ 3 రాశులకు అన్నీ కష్టాలే
సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
బయట కొనడం కంటే ఇంట్లోనే బేబీ ఆయిల్ తయారు చేసుకోవచ్చు..
బయట కొనడం కంటే ఇంట్లోనే బేబీ ఆయిల్ తయారు చేసుకోవచ్చు..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..