Aliens: ఏలియన్స్‌ రక్తం ఏ రంగులో ఉంటుందో తెలుసా? ఆసక్తికర విషయాలు

ఈ విశ్వం మనకు మాత్రమే సొంతం కాదని బలంగా భావిస్తున్న శాస్త్రవేత్తలు ఏలియన్స్‌పై గత కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అయితే...

Aliens:  ఏలియన్స్‌ రక్తం ఏ రంగులో ఉంటుందో తెలుసా? ఆసక్తికర విషయాలు
Mystery About Aliens
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 25, 2021 | 4:20 PM

ఈ విశ్వం మనకు మాత్రమే సొంతం కాదని బలంగా భావిస్తున్న శాస్త్రవేత్తలు ఏలియన్స్‌పై గత కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇన్నేళ్లలో వాటికి సంబంధించిన ఏ కచ్చిత ఆధారాన్ని కనుగొనలేకపోయారు. కానీ ఏలియన్స్ ఉన్నాయంటూ ప్రగాఢంగా నమ్ముతున్న వారు తమ పరిశోధనలను కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా కొంతమంది సైంటిస్టులు వెల్లడించిన ఆసక్తికర విషయాలు ప్రతి ఒక్కరిని షాక్‌కు గురి చేస్తున్నాయి.

ఏలియన్స్‌ రక్తం ఏ రంగులో ఉంటుంది.?

గత కొన్నేళ్లుగా చేస్తున్న పరిశోధనల్లో ఏలియన్స్‌ కచ్చితంగా ఈ ఆకారంలో ఉంటాయనో లేదా సినిమాలో చూపించిన విధంగా ఉంటాయన్న విషయంలో స్పష్టత లేదు. అవన్నీ ఊహాజనితమే. అవి ఏ ఆకారంలో ఉంటాయి.? అసలు వాటిలో ప్రవహించే రక్తం ఎరుపు రంగులోనే ఉంటుందా..? అవి ఎలాంటి ఫుడ్ తింటాయి అన్న విషయాలు ఇప్పటికీ అంతు చిక్కనిదే. ఎందుకంటే.. అసలు ఏలియన్స్‌ ఉన్నాయా…? లేవా.? అన్నదే శాస్త్రియంగా నిర్థారణ కానప్పుడు… మిగితా విషయాలపై ఇప్పుడే ఓ కొలిక్కి రాలేమని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే తాజాగా కొందరు శాస్త్రవేత్తలు మాత్రం, ఏలియన్స్‌ అచ్చం మనిషి ఆకారంలో ఉండే అవకాశం ఉందని, వారి శరీర రంగు మాత్రం కాస్త విభిన్నంగా ఉండొచ్చని చెబుతున్నారు. ఏలియన్స్‌ నివసిస్తున్న గ్రహంలో కూడా భూమి కక్ష్యలో ఉండే వనరులు ఉంటే అవి కూడా మనలాగే ఉండి ఉంటారని అంటున్నారు శాస్త్రవేత్తలు. కానీ అలా కాకుండా భిన్నవాతావరణంలో ఏలియన్స్‌ జీవిస్తూ ఉన్నట్లు అయితే.. వాళ్ల చర్మం నీలిరంగు రంగులో, రక్తం ముదురు నీలం, ఆకుపచ్చ లేదా నలుపు రంగులోకి ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

Also Read: సతీసమేతంగా ఇంటికి వెళ్లి నవరస నటనా సార్వభౌముడుని విష్ చేసిన మెగాస్టార్

 వాళ్లు మేక వన్నె పులులు.. ‘ఆంధ్రా ఊటీ’ అరకులో నయా స్మగ్లింగ్ యాంగిల్