Pensions For Dogs, Horses : కుక్కలకు, గుర్రాలకు పెన్షన్.. పార్లమెంట్‌లో చట్టం.. విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Pensions For Dogs, Horses : ఎక్కడైనా మనుషులకు పెన్షన్ ఇవ్వడం చూశాం కానీ జంతువులకు పెన్షన్ ఇవ్వడం చూశామా.. అయితే పోలాండ్ దేశంలో
Pensions For Dogs, Horses : ఎక్కడైనా మనుషులకు పెన్షన్ ఇవ్వడం చూశాం కానీ జంతువులకు పెన్షన్ ఇవ్వడం చూశామా.. అయితే పోలాండ్ దేశంలో కుక్కలు, గుర్రాలకు పెన్షన్ అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకించి పెన్షన్ అందించనున్నారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.. రాష్ట్ర ప్రభుత్వాలకు సర్వీసు అందిస్తున్న కుక్కలు, గుర్రాల కోసం ప్రత్యేకించి పెన్షన్ అందించేందుకు పోలాండ్ ప్లాన్ చేస్తోంది. మనుషుల మాదిరి కుక్కలు, గుర్రాలు సేవలనందిస్తున్నాయి.. సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి వాటి శ్రమను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వాటికి కూడా పెన్షన్ అందించాలని నిర్ణయం తీసుకుంది.
ప్రత్యేకించి పోలాండ్ దేశంలో పోలీస్, బోర్డర్ గార్డ్, ఫైర్ సర్వీస్‌లో పనిచేసే కుక్కలు, గుర్రాల కోసం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటికే వాటి భవిష్యత్ సంక్షేమానికి సాయం అందిస్తుంటుంది. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ జంతువులకు అధికారిక హోదాను ఇచ్చే కొత్త చట్టాన్ని ప్రతిపాదించింది. ఈ ముసాయిదా చట్టం ఈ ఏడాది చివర్లో ఆ దేశ పార్లమెంటులో ఆమోదం పొందాల్సి ఉంది. అయితే ప్రస్తుతం సర్వీసులో 1,200 కుక్కలు, 60కి పైగా గుర్రాలు ఉన్నాయి. ఇకనుంచి ప్రతి సంవత్సరం పదిశాతం జంతువులు విరమణ తీసుకుంటాయని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. ఇక కుక్కలలో ఎక్కువ భాగం జర్మన్ లేదా బెల్జియన్ షెపర్డ్స్ ఉన్నాయి. పశ్చిమ-మధ్య పోలాండ్‌లోని గియర్‌లాటోవోలో ప్రైవేటుగా నడుస్తున్న ఆశ్రయంలో 10 కుక్కలు, రిటైర్డ్ ఐదు పోలీసు గుర్రాలు ఉన్నాయి.