బెంగాల్ ఎన్నికలు, బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీపై హోలీ రంగు చల్లిన గుర్తు తెలియని వ్యక్తులు, కుడి కన్ను మంట
బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ హుగ్ల్లీ జిల్లాకు ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ ఓ ప్రాంతంలో మహిళలు, యువకులు, పిల్లలు హోలీ ఆడుతూ కనిపించారు.. వారు పిలవగానే తాను వెళ్ళానని..,
బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ హుగ్ల్లీ జిల్లాకు ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ ఓ ప్రాంతంలో మహిళలు, యువకులు, పిల్లలు హోలీ ఆడుతూ కనిపించారు.. వారు పిలవగానే తాను వెళ్ళానని , వారిని చూసి ముచ్చట పడి అక్కడే కొద్దిసేపు నిలబడిపోయానని తెలిపింది. .. ఆమెను చూసిన వారు ఆమెపై రంగులు చల్లబోగా ఆమె కరోనా ఉందని అంటూ వారించి..తనకు ఎరుపు రంగుతో బిందీ పెడితే చాలునని చెప్పింది. అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు తనపై తప్పకుండా రంగులు చల్లుతానని బెదిరించినంత పని చేశారని ఆమె తెలిపింది. అప్పటికి వెళ్ళిపోయినట్టే వెళ్ళినవాళ్ళు మళ్ళీ తిరిగి వఛ్చి తనపై రంగులు చల్లారని వెల్లడించింది. అయితే ఆ రంగుల్లో ఏం కలిపారో గానీ అది తన ముఖంపై పడిన వెంటనే తన కళ్ళు… ముఖ్యంగా కుడికన్ను మండటం ప్రారంభించిందని లాకెట్ ఛటర్జీ వెల్లడించింది. కళ్ళజోడు పెట్టుకున్నందుకు కొంతవరకు నయమేనని, కానీ ఆ బాధ భరించలేకపోయానని ఆమె పేర్కొంది. కొంత సేపటికి కళ్లుతెరిచి చూసేసరికి కొంత దూరంలో ముగ్గురు నలుగురు వ్యక్తులు కనిపించారు . వారి చొక్కాలపై టీఎంసీ బ్యాడ్జ్ లు కన్పించాయి. అని ఆమె తెలిపింది. వారే తనపై హానికరమైన రంగులు చల్లినట్టు భావిస్తున్నానని ఆమె చెప్పింది. మీడియా ముందు ఆమె ఈ విషయాలు చెబుతూ కన్నీటి పర్యంతమైంది. ఒక మహిళ పట్ల ఇలాగే ప్రవర్తిస్తారా, ఇలా హొలీ పేరిట దాడి చేస్తారా అని ఆమె వాపోయింది .
తృణమూల్ కాంగ్రెస్ గూండాలే ఈ పని చేశారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే ఇలాంటి దుర్మార్గపు చర్యలకు దిగుతున్నారని వారు ట్వీట్ చేశారు. చింసూరా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి లాకెట్ ఛటర్జీ పోటీ చేస్తున్నారు.
TMC goons led by GP Pradhan Bidyut Biswas, Kodalia No. 2, attacked Locket Chatterjee, a BJP candidate from Chinsurah Assembly.
The ‘khela’ of hatred, violence & harassment will be put to an end soon. This cowardly ‘khela’ of harassing women is triggered by the fear of defeat! pic.twitter.com/yyLBbOMli2
— BJP Bengal (@BJP4Bengal) March 27, 2021
మరిన్ని చదవండి ఇక్కడ: పురోహితుల క్రికెట్ లీగ్ మీరు ఎప్పుడైనా చూశారా..!సిక్సర్లు,ఫోర్లతో దుమ్ములేచిన గ్రౌండ్ : Pandits Cricket League video.
బాతుపిల్లకు సాయంచేసిన మనసున్న మృగరాజు వీడియో.. ముచ్చట పడుతున్న నెటిజన్లు : Lion And Duck Video.