Rare Fish: తెలుగు రాష్ట్రాల్లో మత్సకారులకు చిక్కుతున్న అరుదైన చేపలు.. తాజాగా దొరికిన వాటి వివరాలు

విజయనగరం జిల్లాలో మత్స్యకారుడి వలకు రేర్ ఫిష్ చిక్కింది. భోగాపురం మండలం ముక్కాం తీరం సముద్రంలో జాలరి వాసుపల్లి ఎర్రయ్య వేటకు వెళ్లాడు. అతడి వలకు...

Rare Fish: తెలుగు రాష్ట్రాల్లో మత్సకారులకు చిక్కుతున్న అరుదైన చేపలు.. తాజాగా దొరికిన వాటి వివరాలు
Follow us

|

Updated on: Mar 04, 2021 | 11:19 AM

విజయనగరం జిల్లాలో మత్స్యకారుడి వలకు రేర్ ఫిష్ చిక్కింది. భోగాపురం మండలం ముక్కాం తీరం సముద్రంలో జాలరి వాసుపల్లి ఎర్రయ్య వేటకు వెళ్లాడు. అతడి వలకు భారీ చేప చిక్కడంతో మంచి ఆనందంలో ఉన్నాడు. ఆ చేపను పరిశీలించి పెద్దమట్ట అని పిలుస్తారని.. రెండేళ్ల క్రితం ఇదే ప్రాంతంలో 25కేజీల బరువున్న ఇలాంటి చేప వలలో పడిందని తెలిపాడు. ఇప్పుడు దొరికిన పెద్దమట్ట 50కేజీలకుపైగా బరువు తూగిందని తెలుస్తోంది. ఈ చేపకు మార్కెట్‌లో కూడా మంచి డిమాండ్ ఉందని స్థానిక మత్సకారులు వెల్లడించారు

చేపల వేటతో జీవనం సాగిస్తున్న మరో మత్స్యకారుడి వలకు ఇటీవల అరుదైన చేప చిక్కింది. ఆ చేపను చూసిన జాలరి అవాక్కయ్యాడు. గతంలో ఎన్నాడూ చూడని రీతిలో కనిపించిన చేపను చూసిన స్థానిక మత్స్యకారులు సైతం ఆశ్చర్యపోయారు. ఎందుకంటే..భారీ బరువుతో ఆ చేప బంగారు వర్ణంతో మెరిసి పోతోంది. మహబూబాబాద్‌ జిల్లా‌లో ఓ మత్స్యకారుడికి ఈ అరుదైన చేప చిక్కింది. జిల్లాలోని కురవి మండలం తిర్మలాపురం గ్రామంలోని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన మత్స్యకారుడి వలకు ఈ చేప చిక్కింది. ఈ చేప బరువు..తొమ్మిది కేజీలకు పైగా ఉందని తెలుస్తోంది. పైగా అది బంగారు రంగులో కనిపించింది.

బంగారు తీగ రకానికి చెందిన ఈ చేప పూర్తిగా బంగారం రంగులో మెరిసిపోతోంది. అయితే, ఈ విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన కల్లెపు కృష్ణ అనే వ్యక్తి ఈ చేపను కొనుగోలు చేశాడు. ఈ రకానికి చెందిన చేపలు అక్కడక్కడా బంగారు రంగుతో ఉండడం సహజమే అని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడి చెరువులో ఇంత పెద్ద చేప, అదీ బంగారు వర్ణంలో లభించడం ఇదే తొలిసారి అంటున్నారు ఇక్కడి జాలర్లు.

మరోవైపు, ఇటీవలే సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం అక్కెనపల్లి గ్రామంలోని చెక్ డ్యాంలో జాలరులకు 10 కిలోల చేప చిక్కింది. చెక్ డ్యాంలో నీళ్లు తక్కువగా ఉండటంతో మత్స్యకారులు వలలు వేశారు. దీంతో వలకు 10 కిలోల బంగారు తీగ రకం చేప చిక్కింది. పది కిలోల చేపను స్థానికులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. తెలంగాణ సర్కార్ మత్స్య సంపంద పెరుగుదలకు చేపట్టిన కార్యక్రమాలు మెరుగైన ఫలితాలు ఇస్తున్నాయని, మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read:

మీరు రేషన్ పంపిణీలో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారా..? ఈ నంబర్ల ద్వారా ఫిర్యాదు చేయండి

పొలార్డ్​ ఊచకోత.. 6 బంతుల్లో 6 సిక్సర్లు.. యూవీ, హర్షెల్లే గిబ్స్ సరసన…