Viral video : దాహంతో ఉన్న పాముకు నీళ్లు తాగించాడు.. తర్వాత ఆ పాము ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..

ప్రపంచంలో ప్రతి పురుగును కదిలించేది ఒక్కటే ఆకలి అని ఎదో సినిమాలో  చెప్తే విన్నాం.. ఆకలి ఊదే నాగస్వారానికి.. ఆడక తప్పదని ఎవరో ఓ గొప్ప కవి రాస్తే  చదివాము .. అది ముమ్మాటికి నిజమే..

  • Rajeev Rayala
  • Publish Date - 1:58 pm, Thu, 4 March 21
Viral video : దాహంతో ఉన్న పాముకు నీళ్లు తాగించాడు.. తర్వాత ఆ పాము ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..

Viral video : ప్రపంచంలో ప్రతి పురుగును కదిలించేది ఒక్కటే ఆకలి అని ఎదో సినిమాలో  చెప్తే విన్నాం.. ఆకలి ఊదే నాగస్వారానికి.. ఆడక తప్పదని ఎవరో ఓ గొప్ప కవి రాస్తే  చదివాము .. అది ముమ్మాటికి నిజమే.. ఆకలి ముందు ఎంతటీ వీరుడైనా.. తలొగ్గక తప్పదు. ఆకలి భూతం మనుషులకు మాత్రమే కాదు జంతువులను కూడా వెంటాడుతుంది. వేటాడే జంతువులు సైతం.. తన నైజంను మరిచి మరీ.. తన ఆకలి తీర్చిన వారిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటూ ఉంటాయి.  ఇందుకు సంబంచిన చాలా సందర్భాలు సోషల్ మీడియాలో తాజాగా దాహంతో అలమటించిపోతున్న పాముకు.. నీళ్లు తాపాడు ఓ వ్యక్తి. ఆ దాహం ముందు.. తాను కాటేస్తానన్న విషయాన్ని మర్చి.. గుటగుట నీళ్లు తాగింది ఆ పాము.

పాముకు ఓ వ్యక్తి నీళ్లు తాగిస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియోను ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి ‘ప్రేమ, నీరు.. ఈ రెండు జీవితంలో ముఖ్యమైనవి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్‌. ఈ వీడియోలో ఓ వ్యక్తి దాహంతో ఉన్న నాగుపాముకు దగ్గరగా వెళ్లి దాని నోటికి దగ్గరగా  ఓ స్పూన్ తో నీళ్లు తాగించాడు.  దాహంతో ఉన్న ఆ పాము నీరు గుటగుట తాగేస్తున్న ఈ వీడియోకు ఇప్పటి వరకు 9వేలకు పైగా వ్యూస్‌, వందల్లో కామెంట్స్‌ వచ్చాయి. ఇప్పటికి వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది. పాముకు దగ్గరగా వెళ్లి మరీ నీరు తాగిస్తున్న సదరు వ్యక్తి ధైర్యానికి అవాక్కవుతూ నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Yusaku Maezawa SpaceX Moon: 10 నిముషాల్లో ఎగసి, గాల్లోనే పేలిపోయి, స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ ఫెయిల్యూర్, ఎలన్ మస్క్ మౌనం

మీ వల్లే ఈ జర్నీ బ్యూటిఫుల్‌గా సాగింది..మరో రికార్డు సొంతం చేసుకున్న క్రికెటర్ కోహ్లీ : Virat Kohli New Record Video

ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతోన్న బంద్‌.. బీజేపీ మినహా మద్ధతు ఇచ్చిన అన్ని పార్టీలు..