Viral Video: యజమాని పక్కన నిద్రిస్తున్న కుక్కపిల్లను చూసి.. ఈ కుక్క ఏం చేసిందో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు.!
Dog jealous other Doggy: విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంటాయి శునకాలు. మానవులతో కలసిమెలసి ఉంటూ ఎంతో సాన్నిహిత్యంగా మెలుగుతాయి. నమ్మితే వెన్నంటే ఉంటూ ప్రాణాలను సైతం కాపాడుతాయి. అయితే కొన్ని
Dog jealous other Doggy: విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంటాయి శునకాలు. మానవులతో కలసిమెలసి ఉంటూ ఎంతో సాన్నిహిత్యంగా మెలుగుతాయి. నమ్మితే వెన్నంటే ఉంటూ ప్రాణాలను సైతం కాపాడుతాయి. అయితే కొన్ని సందర్భాల్లో కుక్కలు చేసే పనులు అందరినీ ఆశ్చరపరుస్తుంటాయి. తాజాగా ఓ కుక్క.. చిన్న కుక్కపిల్ల యజమాని పక్కన పడుకుని ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయింది. వెంటనే దానిని డస్ట్ బిన్‌లో పడేసింది. ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు నెట్టింట వైర్‌గా మారింది. ఈ వీడియోను చూసినవారంతా నోరెళ్లబెడుతూ కుక్క.. చేసిన పనికి అసూయ, పోటీ అంటూ పలు కామెంట్లు పెడుతున్నారు.
ఒక బుజ్జి కుక్క పిల్ల యజమాని పక్కన పడుకోని ఉంది. అయితే.. అక్కడే ఒక పెద్ద కుక్క సైతం ఉంది. ఈ క్రమంలో చిన్న కుక్క పిల్ల యజమాని పక్కన పడుకోవడం చూసి.. పెద్ద కుక్క జీర్ణించుకోలేకపోయింది. వెంటనే యజమాని పక్కన ఉన్న బుజ్జి కుక్కపిల్లను నోటితో పట్టుకోని తీసుకొచ్చి.. డస్ట్‌బిన్‌లో పడేసింది. వెంటనే అది యజమాని పక్కన సోఫా పైకి చేరి దర్జాగా కూర్చొంది. పాపం చిన్న కుక్క పిల్లకు ఏం అర్ధం కాక బిత్తరపోయి అక్కడే నిల్చొని చూస్తుంటుంది.
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియో చూడండి..
View this post on Instagram
ఈ ఫన్నీ వీడియో జంతువులలో ఉన్న భావోద్వేగాన్ని, అసూయను తెలియజేస్తోందంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. మానవుల మధ్య అసూయ, పోటీ ఉన్నట్లే పెంపుడు జంతువుల మధ్య కూడా ఉంటుదని పేర్కొంటున్నారు. ఈ వీడియోను ప్రస్తుతం వేలాది మంది వీక్షించి.. పలు కామెంట్లు చేస్తున్నారు.
Also Read: