Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తన పర్సనల్ డైరీ అత్తమామలు చదివారని యువతి సూసైడ్.. ఇంతకీ ఆమె ఏం రాసిందంటే..?

తన పర్సనల్ డైరీని మామ, అత్త చదివారని.. ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది ఓ యువతి. ఈ ఘటన మహారాష్ట్ర నాగ్​పుర్​లోని సావనేర్ పోలీసు స్టేషన్​ పరిధిలో జరిగింది.

తన పర్సనల్ డైరీ అత్తమామలు చదివారని యువతి సూసైడ్.. ఇంతకీ ఆమె ఏం రాసిందంటే..?
Girl Ends Life
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 22, 2022 | 1:31 PM

Crime News: ప్రతి ఒక్కరికి ఒక పరిధి అనేది ఉంటుంది. ఎదిటివారి లైఫ్‌లోకి ఎక్కువగా తొంగి చూడకూడదు. అలా లైన్ క్రాస్ చేస్తే పర్యావసనాలు ఊహించనంత దారుణంగా ఉంటాయి. అలాంటి ఘటనే మహారాష్ట్ర(Maharashtra) నాగ్​పుర్​(nagpur)లోని సావనేర్ పోలీసు స్టేషన్​ పరిధిలో జరిగింది. తన వ్యక్తిగత డైరీ చదివారని ఓ యువతి జీవితాన్నే ముగించింది. తన పర్సనల్ డైరీ వేరేవాళ్లు చదవడం వచ్చిన సమస్యలే ఆమెను ఆత్మహత్య దిశగా పురిగొల్పాయి. వివరాల్లోకి వెళ్తే.. చాలామందికి డైరీ రాసే అలవాటు ఉంటుంది. రోజూ జరిగిన విషయాలు అందులో రాసుకుంటూ ఉంటారు. అలాగే ఎమ్మెస్సీ పూర్తి చేసి ఈ మధ్యే ప్రైవేట్ ఉద్యోగంలో చేరి.. అత్త మామలు ఇంట్లో నివాసం ఉంటున్న నికితా డహట్​​ కూడా  చిన్నప్పటి డైలీ డైరీ రాసుకునేది. అలా చేస్తే మనసుకు స్వాంతన కలుగుతుందని ఆమె నమ్మకం. నికిత మామ రత్నాకర్.. కాలేజీలో ప్రొఫెసర్​గా వర్క్ చేస్తుండగా.. అత్త మంగళ హౌస్‌వైఫ్.

అయితే అత్తమామలు ఇద్దరు ఉన్న చోట ఉండలేదు. నికిత డైరీ చదవాలని క్యూరియాసిటీ వారికి పెరిగింది. దీంతో వన్ బ్యాడ్ డే ఆ డైరీ తస్కరించి సీక్రెట్‌గా చదివారు.  అందులో ఓ చోట తన అత్త ‘దెయ్యం’ లాంటిదని రాసింది నికిత. దీంతో.. మంగళకు విపరీతమైన కోపం వచ్చింది. ఇంట్లో ఉంచుకుని అన్నం పెడుతుంటే తననే దెయ్యం అంటుందా అంటూ రెచ్చిపోయింది. వెంటనే బంధువులను పిలిచి పంచాయతీ పెట్టింది. బంధువులు కూడా ఇకపై ఇలా చేయొద్దని నికితకు కాస్త కటవుగా చెప్పారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై సదరు యువతి ఆత్మహత్య చేసుకుంది. దీనికి బాధ్యులైన మామ రత్నాకర్, అత్త మంగళపై పోలీసులకు కంప్లైంట్ చేశాడు మృతురాలి సోదరుడు పంకజ్.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..