మరాఠీలోనే మాట్లాడాలంటూ ఆందోళనకు దిగిన రచయిత్రి

మరాఠీవాళ్లకు భాషాభిమానం కొంచెం ఎక్కువే! ముంబాయి మహానగరంలో అయితే పనిగట్టుకుని మరీ మరాఠీ మాట్లాడుతుంటారు. అదేం తప్పు కాదనుకోండి! మరాఠీ రాదన్నవారిని ఓ రకంగా చూస్తారక్కడ! మామూలువారికే అంతేసి భాషాభిమానం ఉంటే మరాఠీ రచయిత్రి శోభా దేశ్‌పాండేకు ఇంకెంత ఉండాలి?

మరాఠీలోనే మాట్లాడాలంటూ ఆందోళనకు దిగిన రచయిత్రి
Follow us

|

Updated on: Oct 10, 2020 | 11:19 AM

మరాఠీవాళ్లకు భాషాభిమానం కొంచెం ఎక్కువే! ముంబాయి మహానగరంలో అయితే పనిగట్టుకుని మరీ మరాఠీ మాట్లాడుతుంటారు. అదేం తప్పు కాదనుకోండి! మరాఠీ రాదన్నవారిని ఓ రకంగా చూస్తారక్కడ! మామూలువారికే అంతేసి భాషాభిమానం ఉంటే మరాఠీ రచయిత్రి శోభా దేశ్‌పాండేకు ఇంకెంత ఉండాలి? అదే ఆమెను ఓ షాపు ముందు ఆందోళన చేసేలా చేసింది.. కారణం ఆ జ్యువెలరీ షాపు యజమాని మరాఠీ మాట్లాడకపోవమే! మొన్న ఆమె కొలాబాలోని మహావీర్‌ జ్యువెలరీ షాపుకెళ్లారు.. ఆ షాపులోని వ్యక్తి హిందీలోనే మాట్లాడుతుండటం శోభకు నచ్చలేదు.. మరాఠీలో మాట్లాడమని చెప్పి చూశారు.. ఆయన వినలేదు.. మరాఠీలోనే మాట్లాడాలి అని ఆమె పట్టుబట్టారు.. ఆమె సతాయింపులు భరించలేక పోలీసులకు ఫోన్‌ చేశాడా యజమాని.. ! పోలీసులు వచ్చి ఆమెకు సర్ది చెప్పి షాపు నుంచి బయటకు తీసుకెళ్లారు.. బయటకెళ్లాక ఆమె షాపు ముందే బైఠాయించారు.. ఆందోళనకు దిగారు.. ఈ విషయం నవనిర్మాణ సేనకు తెలిసింది. వెంటనే ఆ పార్టీ నాయకుడు సందీప్‌ దేశ్‌పాండే అక్కడికి వచ్చారు. ఆందోళనలో తనూ భాగం పంచుకున్నారు. 20 గంటల పాటు ఆందోళన సాగింది.. ఆ తర్వాత అక్కడికి షాపు యజమాని వచ్చారు.. ఆమెకు క్షమాపణ చెప్పి తీరాలంటూ నవ నిర్మాణ సేన పట్టుబట్టింది. దాంతో అక్కడ కాసేపు గందరగోళం నెలకొంది..ఎమ్‌ఎన్‌ఎస్‌కు చెందిన ఓ కార్యకర్త అయితే యజమానిపై చేయి కూడా చేసుకున్నాడు… ఎందుకొచ్చిన తంటా అనుకున్న షాపు యజమాని శోభా దేశ్‌పాండేకు సారీ చెప్పారు. ఈ ఘటనపై మహారాష్ట్రలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. కొందరు శోభా దేశ్‌పాండేకు మద్దతు తెలుపుతుంటే.. ఇలా చేయడం తప్పని మరికొందరు అంటున్నారు..