Wrestlers Protest: ‘ఉద్యమం.. ఉద్యోగం.. రెండూ చేస్తాం’.. విధుల్లో చేరుతున్నట్లు ప్రకటించిన కీలక రెజ్లర్లు..

Wrestlers Protest News: రెజ్లర్ల ఉద్యమం కంటిన్యూగా కొనసాగుతుందని.. తప్పుడు ప్రచారం చేయొద్దంటూ రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ పేర్కొన్నారు. ఉద్యమం నుంచి తాను తప్పుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఓ వైపు నిరసన తెలుపుతూనే ఉద్యోగ విధుల్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు సాక్షి మాలిక్‌, పునియా, ఫొగట్‌ స్పష్టం చేశారు.

Wrestlers Protest: ‘ఉద్యమం.. ఉద్యోగం.. రెండూ చేస్తాం’.. విధుల్లో చేరుతున్నట్లు ప్రకటించిన కీలక రెజ్లర్లు..
Wrestlers Protest
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 05, 2023 | 4:13 PM

Wrestlers Protest News: రెజ్లర్ల ఉద్యమం కంటిన్యూగా కొనసాగుతుందని.. తప్పుడు ప్రచారం చేయొద్దంటూ రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ పేర్కొన్నారు. ఉద్యమం నుంచి తాను తప్పుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఓ వైపు నిరసన తెలుపుతూనే ఉద్యోగ విధుల్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు సాక్షి మాలిక్‌, పునియా, ఫొగట్‌ స్పష్టం చేశారు. 5 నెలలుగా కొనసాగుతున్న రెజ్లర్ల ధర్నాకు మద్దతుగా నిలస్తూ ఉద్యమంలో పాల్గొంటున్న సాక్షి మాలిక్‌.. తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదటినుంచి ఆందోళనలో ముందున్న సాక్షి మాలిక్.. గతంలో మెడల్స్ గంగానదిలో వేస్తానంటూ బయలుదేరి వెళ్లిన వారిలో ఉన్నారు. అయితే, శనివారం రాత్రి రెజ్లర్లు భజరంగ్ పునియా, సాక్షి మాలిక్, సంగీతా ఫొగాట్, సత్యవర్త్ కడియన్‌ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారు. అనంతరం, సాక్షి పోరాటాన్ని విరమించుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో సాక్షి మాలిక్ ట్విట్ చేసి.. తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. ‘‘న్యాయం కోసం చేస్తున్న పోరాటంలో మేమేమీ వెనక్కు తగ్గలేదు.. ఉద్యమంతోపాటు రైల్వేలో నా బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది. దయచేసి తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దు’’ అంటూ రెజ్లర్ సాక్షి మాలిక్ ట్వీట్ చేశారు. కాగా.. సాక్షి మాలిక్ నార్తెన్ రైల్వేస్‌లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం చేస్తున్నారు.

రెజ్లర్లు భజరంగ్ పునియా, సాక్షి మాలిక్, సంగీతా ఫొగాట్, సత్యవర్త్ కడియన్‌ తో భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టం అందరికీ సమానమే అని, చట్టం తన పని తాను చేస్తుందని అమిత్ షా రెజ్లర్లకు భరోసా ఇచ్చారు. ఈ క్రమంలోనే సాక్షి మాలిక్, వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా ఉద్యోగ విధుల్లో చేరుతామని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. గత అయిదు నెలలుగా ఉద్యమం రెజ్లర్లు.. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయనిదే తాము ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. ఇటీవల నూతన పార్లమెంట్‌కు మార్చ్ చేపట్టిన రెజ్లర్లను పోలీసులు అడ్డుకుని, అరెస్టు చేశారు. వారిలో సాక్షి మాలిక్ సహా వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియా, విజయేందర్ ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..